E-Paper
Advertisement

Rana about Prabhas: ప్రభాస్ ఎవరు..? అని అడిగారు.. మహేశ్ బాబు కూడా నమ్రత భర్తగా మాత్రమే తెలుసు.. రానా!

Rana about Prabhas: ప్రభాస్ ఎవరు..? అని అడిగారు.. మహేశ్ బాబు కూడా నమ్రత భర్తగా మాత్రమే తెలుసు.. రానా!
Advertisement

Rana About Prabhas – Mahesh Babu And Kalki 2898 Ad: టాలీవుడ్ స్టార్ హీరో రానా ‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ అయింది. దీని తర్వాత పలు బడా సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో వచ్చి ప్రేక్షకులను అలరించాడు. తన హైట్‌కి తగ్గ పాత్రలను ఎంచుకుంటూ.. ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు.

అంతేకాకుండా ఓ వైపు హీరోగా.. మరోవైపు నిర్మాతగా దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న రానా.. చాలా విషయాలు పంచుకున్నాడు. ఈ మేరకు బాహుబలి సమయంలో బాలీవుడ్‌లో.. టాలీవుడ్ ఇండస్ట్రీ నటుల గురించి ఉన్న ఒపీనియన్‌‌తో సహా ఇప్పుడు వస్తున్న కల్కి, వెట్టియాన్ మూవీల గురించి కూడా ఆసక్తికర విషయాలు తెలియజేశాడు.

Advertisement

ఒకప్పుడు టాలీవుడ్ నటులు అన్నా.. సినిమాలన్నా బాలీవుడ్‌లో చాలా చిన్న చూపు ఉండేది. తెలుగు నటీ నటుల్ని.. బాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకునేది కాదు. అయితే రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి రూపొందుతున్న టైంలో రానా బాలీవుడ్‌కి వెళ్లాడట. అక్కడ రానాకు కాస్తో కూస్తో పాపులారిటీ ఉండటంతో మరికొన్ని పరిచయాలు ఉన్నాయి.

Also Read: ‘రానా నాయుడు 2’లో పవర్‌ఫుల్ విలన్.. ఆ పాత్రలో దుమ్ము దులిపేస్తాడంట!

Advertisement

దీంతో బాహుబలి సినిమా గురించి రానా బాలీవుడ్‌లోని కొందరికి చెప్పాడట. అయితే అప్పుడు వారు బాహుబలి సినిమాలో ఎవరు నటిస్తున్నారని అడిగారట. దీంతో ఆ మూవీలో ప్రభాస్ నటిస్తున్నాడని చెప్పగా.. ప్రభాస్ ఎవరు..? అని అన్నారట. దీంతో రానా ఏం చెప్పాలో తెలియక మిర్చి, ప్రభాస్ సినిమా హీరో అని చెప్పుకొచ్చాడట. బాలీవుడ్‌లో నార్మల్‌గా టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్ తప్పితే మరెవరూ తెలియదు. అలాంటప్పుడు యంగ్ జనరేషన్ అయిన ప్రభాస్ వారికి తెలిసే అవకాశం లేదు. అయితే ఇక మహేశ్ బాబు కూడా వారికి నమ్రత భర్తగా మాత్రమే తెలుసని అక్కడ జరిగిన విషయాల్ని తాజాగా పంచుకున్నాడు.

ఇక ఇప్పటి విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అన్నాడు. ఈ మూవీ రిలీజ్ తర్వాత అందరూ దీని గురించే మాట్లాడుకుంటారని తెలిపాడు. ఈ మూవీ హాలీవుడ్ అవేంజర్స్ టైప్‌లో ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతోపాటు అతడు నటిస్తున్న మరో సినిమా వెట్టియాన్‌ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తుందని తెలిపాడు.

Also Read: Raju Yadav Movie Trailer: గెటప్ శ్రీనుకి లిప్ కిస్ పెట్టిన హీరోయిన్.. కొత్త సినిమా ట్రైలర్ అదిరిపోయిందిగా..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ఈ మూవీలో తాను కూడా భాగం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. ఇక ఈ మూవీ తెలుగులో వేటగాడు టైటిల్‌తో రూపొందుతుంది. ఇందులో రానాతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్‌తో సహా మరికొంతమంది నటులు ఇందులో భాగం అయ్యారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×