BigTV English

Gannavaram Assembly Constituency: వల్లభనేని వంశీ Vs యార్లగడ్డ వెంకట్రావు.. గన్నవరం గడ్డ.. ఎవరిది అడ్డా..?

Gannavaram Assembly Constituency: వల్లభనేని వంశీ Vs యార్లగడ్డ వెంకట్రావు.. గన్నవరం గడ్డ.. ఎవరిది అడ్డా..?

గన్నవరం నియోజకవర్గం.. ఈ పేరు నిత్యం ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. విమర్శలు ప్రతి విమర్శలు గొడవలు ఇలా ఏదో ఒక వివాదంతో ఫోకస్ అవుతూనే ఉంటుంది. అక్కడ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీమోహన్ దూకుడే అందుకు కారణమని వేరే చెప్పనవసరం లేదు.. టీడీపీ గుర్తుతో రెండు సార్లు గెలిచిన వంశీ ఈ సారి వైసీపీ అభ్యర్ధిగా పోటీ పడుతున్నారు. టీడీపీకి మంచి పట్టున్న గన్నవరంలో ఈ సారి ఆ పార్టీ అభ్యర్ధిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీలో ఉన్నారు.

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ కేవలం 838 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. గన్నవరంలో బలంగా ఉన్న టీడీపీ కేడర్, సామాజికవర్గ సమీకరణలు వంశీకి కలిసి వచ్చాయి .. అయితే ఈ సారి ఈక్వేషన్లు మారిపోవడంతో యార్లగడ్డ భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఆర్ఐ అయిన యార్లగడ్డ వెంకట్రావుకి గన్నవరంలో వ్యక్తిగతంగా మంచి పలుకుబడి ముక్కు సూటి మనిషి, చెబితే చేస్తాడనే వ్యక్తి అన్న గుడ్‌విల్ ఉంది. కేడీసీసీ బ్యాంకుని నష్టాల్లో నుంచి లాభాల్లోకి తెచ్చిన వ్యక్తిగా గుర్తింపు సొంతం చేసుకున్నారు.


Also Read: వెంకటగిరిలో గెలుపెవరిది?

వైసీపీలో ఉన్నప్పుడే పాదయాత్రలు చేసి గడపల గడపకు వెళ్లి ఓట్లు రాబట్టుకున్న యార్లగడ్డ వెంకట్రావు, ఈసారి ఒక్కొక్క గడపను నాలుగు సార్లు చుట్టూ వచ్చి మరి తన గెలుపు పై ధీమాతో మరింత ప్రచారం సాగిస్తున్నారు .. ఆయన ఎన్నారై అయినప్పటికీ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎదుటి వారిని నిందించే నాయకుడ్ని కాదని ప్రజలు నమ్మారు కాబట్టే తనకు ఇంతటి ప్రజాదరణ లభింస్తోందంటున్నారు యార్లగడ్డ.

ఇక వైసిపి నుంచి పోటీ చేస్తున్న వల్లభనేని వంశీ నామినేషన్ రోజే చేతులెత్తేసినంత పని చేశారు.. కనీసం ప్రచారం వాహనంపై నుంచో లేక.. నడవలేక .. ఎక్కడపడితే అక్కడ చతకలబడుతూ నిస్సహాయత కనబరిచారు. ఒకపక్క వైసీపీలో తనకు వ్యతిరేకత ఉండడం. ప్రజల్లో సానుభూతి కోల్పోవడం.. తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం, అసలు ప్రజలకు అందుబాటులో ఉండరనే ప్రచారం. ఇవన్నీ ఆయనకు మైనస్‌గా మారాయంటున్నారు. అటు టీడీపీ, ఇటు వైసీపీల్లో పెరిగిన వ్యతిరేకతతో ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేయలేకపోతున్నారంట.

Also Read: ROJA Nagari Politics: రోజాకు రింగా రింగా.. షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు..

యార్లగడ్డ గెలుపు ఖాయమని గన్నవరంలో ఓపెన్‌గా అంటున్నారు. ఒకపక్క టిడిపి ఓటు బ్యాంకు తో పాటు వైసిపి సానుభూతిపరుల ఓటు బ్యాంకు సైతం యార్లగడ్డ వెంకట్రావు కైవసం చేసుకోబోతున్నారన్న మౌత్ టాక్ నడుస్తుంది. ఇలా వంశీ చేతులెత్తి చేయడం, యార్లగడ్డపై పాజిటివ్ టాక్ తో గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు. గన్నవరంలో ఇప్పుడు యార్లగడ్డ సాధించబోయే మెజార్టీనే హాట్ టాపిక్‌గా మారింది.

Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×