E-Paper
Advertisement

Shankar: హోంటూర్ వీడియో చేసి చిక్కుల్లో పడ్డ నటుడు..

Shankar: హోంటూర్ వీడియో చేసి చిక్కుల్లో పడ్డ నటుడు..
Advertisement

Shankar: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హోమ్ టూర్ల ట్రెండ్ నడుస్తోంది. ఇళ్లంతా చూపిస్తూ వీడియోలు చేసి నెట్టింట్లో పెడుతున్నారు. స్టార్ సెలబ్రెటీల నుంచి చిన్న వారి వరకు అందరూ హోమ్ టూర్లు చేస్తున్నారు. హోమ్ టూర్ల వీడియోలు చూసి కొందరు కేటుగాళ్లు దొంగతనాలకు పాల్పడ్డ ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇటీవల ఓ నటుడు హోమ్ టూర్ వీడియో చేయగా.. అదే అతన్ని చిక్కుల్లో పడేసింది.

చెన్నైలో నివాసం ఉంటున్న రోబో శంకర్ ఇటీవల హోం టూర్ పేరుతో ఓ వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. ఇళ్లంతా తిప్పి చూపిస్తూ.. తాను పెంచుకుంటున్న జంతువులు, పక్షులను కూడా వీడియోలో చూపించాడు. పారాకీట్ అనే రెండు చిలుకలను తాను పెంచుకున్నట్లు వీడియోలు పేర్కొన్నాడు.

Advertisement

ఆ వీడియో కాస్త అటవీశాఖ అధికారుల కంట్లో పడడంతో రోబో శంకర్‌కు షాక్ ఇచ్చారు. అనుమతి లేకుండా చిలుకలను పెంచుకుంటున్నందుకు గానూ అతడికి రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. అలాగే రెండు చిలుకలను స్వాధీనం చేసుకొని గిండిలోని పార్కులో అప్పగించారు.

ఇక రోబోశంకర్ అటవీశాఖ అధికారుల ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. తన భార్య స్నేహితురాలు మూడేళ్ల క్రితం చిలుకలను ఇచ్చినట్లు వెల్లడించారు. వాటిని పెంచుకోవడానికి అనుమతి తీసుకోవాలనే విషయం తనకు తెలియదని చెప్పారు. అలాగే అధికారులు విధించిన రూ. 2.5 లక్షల జరిమానాను చెల్లించనున్నట్లు తెలిపారు.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×