BigTV English

Prabhas Movies : టాక్ ఆఫ్ ది టౌన్… జాక్‌పాట్ ప్రభాస్‌కా..? హోంబలేకా..?

Prabhas Movies : టాక్ ఆఫ్ ది టౌన్… జాక్‌పాట్ ప్రభాస్‌కా..? హోంబలేకా..?

Prabhas Movies : జాక్ పాట్… ఒక్క సారిగా ఏదైన పెద్ద మొత్తంలో లాభం జరిగిన సందర్భాల్లో ఈ పదాన్ని వాడుతారు. అయితే ఈ పదం నిన్నటి నుంచి ఎక్కువ వినిపిస్తుంది ఇండస్ట్రీలో. హోంబలే ఫిల్మ్స్ వాళ్లు ప్రభాస్‌తో ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేసుకున్నట్టు అనౌన్స్ చేశారు. ప్రభాస్‌తో అగ్రిమెంట్ చేసుకుని హోంబలే ఫిల్మ్స్ జాక్ పాట్ కొట్టిందని కొంత మంది అంటుంటే… మరికొంత మంది సౌత్ ఇండియాలోనే టాప్ ప్రొడ్యూసర్స్ చేతిలో ప్రభాస్ పడ్డాడని, అందుకే ఇది ప్రభాస్ కు పెద్ద జాక్ పాట్ అని అంటున్నారు. మరి నిజానికి జాక్ పాట్ ఎవరికి..? నష్టం ఎవరికి? అనేది ఇక్కడ చూద్ధాం…


హోంబలే ఫిల్మ్స్… 2014లో చిన్నగా స్టార్ట్ అయినా నిర్మాణ సంస్థ. మొదటి సినిమాను కన్నడ పవర్ స్టార్ పూనిత్ రాజ్ కుమార్‌తో చేసింది. ‘నిన్నిండాలే’ (Ninnindale) అనే సినిమాను 17 కోట్లతో నిర్మించారు. అది సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, ఆ డబ్బులను 3-4 రోజుల్లోనే కలెక్ట్ చేసింది. ఈ మూవీ తర్వాత యష్‌తో ‘మాస్టర్ పీస్’ (Masterpiece), మళ్లీ పూనిత్‌తో చేసిన ‘రాజ కుమార’ (Raajakumara) కూడా హిట్ అయ్యాయి.

ఇలా వరుస హిట్స్ ఉన్న టైంలో 80 కోట్ల భారీ బడ్జెట్‌తో కేజీఎఫ్ అనే సినిమా చేశారు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేశారు. కన్నడలోనే కష్టం అనుకున్నారు. కానీ, అది పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా 250 కోట్లు వచ్చాయి. కేజీఎఫ్ 12 తో 1250 కోట్లు, కాంతారా మూవీ ఖర్చు పెట్టింది 16 కోట్లు. కానీ, కలెక్షన్లతో వచ్చింది 450 కోట్లు. ఇలా చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్. అలా సౌత్ ఇండియాలోనే టాప్ నిర్మాణ సంస్థగా ఎదిగింది హొంబలే ఫిల్మ్స్. ఇప్పుడు ఈ బ్యానర్‌లో వచ్చే మూవీస్ అన్ని కూడా పాన్ ఇండియావే.


ఈ టైంలో ప్రభాస్ చేత మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంది హోంబలే. ఇందులో సలార్ 2తో పాటు ప్రశాంత్ వర్మతో ఒక మూవీ, లోకేష్ కనగరాజ్‌తో మరో మూవీ ఉంది. ఇంత పెద్ద నిర్మాణ సంస్థ, అందులోనూ సక్సెస్ రేటు ఎక్కువ ఉన్న హోంబలేలో ప్రభాస్ ఏకంగా మూడు సినిమాలు చేసే ఛాన్స్ రావడం గొప్పే అని కొంత మంది అంటున్నారు. అలాగే ఈ అగ్రిమెంట్ చేసుకున్నందుకు గాను ప్రభాస్ కు 600 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ నడుస్తుంది. దీని వల్ల జాక్ పాట్ వచ్చింది ప్రభాస్‌కే అని అంటున్నారు కొంత మంది.

అయితే జాక్ పాట్ ప్రభాస్ కు కాదు… హోంబలే ఫిల్మ్స్ కే అని డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు మరి కొంత మంది సాధారణ ఆడియన్స్ అంటున్నారు. ప్రభాస్ నటించిన చివరి 7 సినిమాలను చూస్తే దాదాపుగా 6000 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూడు సినిమాల్లో 3 సినిమాలు డిజాస్టర్లు ఉన్నా… వచ్చిన కలెక్షన్లు తక్కువేమీ కాదు. అలాగే ప్రభాస్ సినిమా అంటే నిర్మాతలకు ఇబ్బంది ఉండదు. బిజినెస్, ఓటీటీ, శాటిలైట్స్ అంటూ నిర్మాతలు పెట్టినదానికంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి.

అలాంటి హీరోను మూడు సినిమాలకు హోంబలే ఫిల్మ్స్ బుక్ చేసుకుంది. అందులో సలార్ 2 తో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్, లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ కూడా ఉన్నాయి. అంటే నిర్మాతలకు వచ్చే డబ్బులు ఓ రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ కు 600 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడం కూడా తక్కువే అని అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఈ మూడు సినిమాల వల్ల హోంబలే ఫిల్మ్స్ కి 3000 కోట్లకు పైగా కలెక్షన్లు రావడం కన్ఫామ్ అని, అందువల్ల ప్రభాస్ ను బుక్ చేసుకుని హోంబలే ఫిల్మ్స్ పెద్ద జాక్ పాట్ కొట్టిందని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×