E-Paper
Advertisement

Krishnamma: సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఖరారు

Krishnamma: సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఖరారు
Advertisement

Krishnamma Release Date: టాలీవుడ్ మోస్ట్ యంగ్ హీరో సత్యదేవ్. తన సినీ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి పలు సినిమాల్లో హీరోగా, నెగిటివ్ రోల్‌ నటించి ప్రేక్షకుల్ని అలరించాడు. ఎలాంటి పాత్ర అయినా అళవోకగా చేసేస్తాడు. అందరి ఒక దారిలో వెళ్తే.. ఈ హీరో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాడు. కొత్త కొత్త స్టోరీలతో ప్రేక్షకుల్ని అలరించడంలో ఎప్పుడు సత్యదేవ్ ముందుంటాడు.

ఇందులో భాగంగానే ఇప్పుడు మరొక సినిమా చేస్తున్నాడు. అదే ‘కృష్ణమ్మ’. ఈ సినిమాకు వి.వి. గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అరుణాచల క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో ఈ మూవీకి తెరకెక్కుతోంది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ మూవీని మే 3న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆ తేదీ వాయిదా పడింది.

Advertisement

తాజాగా అందుక సంబంధించి మేకర్స్ ఓ అప్డేట్ అందించారు. ఈ మూవీని మొదటగా మే 3న రిలీజ్ చేస్తామన్న మేకర్స్ ఇప్పుడు మరొక తేదీని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ఈ చిత్రాన్ని మే 10న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ మూవీ మే 3న కాకుండా మే 10న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

https://twitter.com/FilmyBowl/status/1783797616519545133

Advertisement

Also Read: కృష్ణమ్మ కోసం వచ్చినా.. ఆచార్యను వదలరేమో కొరటాల.. ?

ఇక కొరటాల శివ విషయానికొస్తే.. మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన కొరటాల శివ.. ఆ తర్వాత జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి సినిమాలతో అపజయం లేని దర్శకుడిగా ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు.

అయితే ఆ తర్వాత చిరంజీవితో ‘ఆచార్య’ మూవీ తెరకెక్కించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ పరాజయాన్ని కైవసం చేసుకుంది. ఈ మూవీతో కొరటాల శివ పరువుమొత్తం రోడ్డుకీడ్చారు. అయినా కొరటాల శివ విశ్వాసం కోల్పోలేదు.

ఆ తర్వాత వెంటనే మరో స్టార్ హీరోతో సినిమాను పట్టాలెక్కించేశాడు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్‌తో ‘దేవర’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీతో తనను విమర్శించిన వారందరికీ బుద్ది చెప్పాలనే ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×