E-Paper
Advertisement

Tarun latest news: అయ్యో.. తరుణ్‌కు ఉత్తుత్తి పెళ్లి కూడా కాదా? ఈసారీ ఫేక్ న్యూసేనట..

Tarun latest news: అయ్యో.. తరుణ్‌కు ఉత్తుత్తి పెళ్లి కూడా కాదా? ఈసారీ ఫేక్ న్యూసేనట..
Advertisement
tarun

Tarun: హీరో తరుణ్. హీరో అంటే ఇప్పుడు కాదనుకోండి. ఒకప్పుటి హీరో. అప్పట్లో లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. తరుణ్ అంటే పడిచచ్చే లేడీ ఫ్యాన్స్ చాలామందే ఉండేవారు. నువ్వే నువ్వే, నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వే లేక నేను లేను.. ఇలా మంచి హిట్లే కొట్టారు. అలా క్రేజ్ ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని ఉంటే ఓ పనైపోయేది. ఇప్పుడు సినిమాలు లేవు.. పెళ్లి కూడా లేదు.

హీరోగా ఉన్నప్పుడు హీరోయిన్ ఆర్తి అగర్వాల్‌లో లవ్ ట్రాక్ నడిచింది. అయితే, మ్యారేజ్‌ ప్రపోజల్‌ను తరుణ్ రిజెక్ట్ చేశాడు. తరుణ్‌ను మర్చిపోలేక సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది ఆర్తి అగర్వాల్. అలా ఆ కథ ముగిసింది. ఆమెను చేసుకున్నా సరిపోయేది. ఇదంతా జరిగి పదేళ్లకు పైనే అవుతున్నా.. ఇప్పటికీ ముదిరిపోయిన బెండకాయలా తరుణ్‌ బ్యాచిలర్‌గానే మిగిలిపోయారు. బహుషా ఆయన చేతిలో పెళ్లి గీత లేనట్టుంది..అంటున్నారు.

Advertisement

కట్ చేస్తే.. ఉన్నట్టుండి తరుణ్‌కు పెళ్లి ఫిక్స్ అయిందంటూ సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. అదికూడా టాలీవుడ్‌ బిగ్ ఫ్యామిలీకి అల్లుడు కాబోతున్నట్టు ప్రచారం నడుస్తోంది. పెళ్లై ఇటీవలే విడాకులు తీసుకున్న ఆ క్యూట్ గర్ల్‌తో మ్యారేజ్ అంటూ న్యూస్ వైరల్ అవుతోంది. అబ్బో.. ఆమెతోనా.. లేటైనా లేటెస్ట్‌గా మంచి అమ్మాయినే పట్టాడంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

ఆ న్యూస్ వాగా వైరల్ కావడంతో.. నటుడు తరుణ్ స్పందించాల్సి వచ్చింది. అబ్బే.. నాకు పెళ్లేంటి.. అదేం లేదు. ఆమెతో తన పెళ్లంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. అయ్యో.. ఇది కూడా ఫేక్ న్యూసేనా? తరుణ్‌కు ఇప్పటికైనా పెళ్లి అవుతోందని అనుకుంటే.. అది కూడా ఉత్తుత్తి వార్తేనా అని ఉసూరుమంటున్నారు సోషల్ మీడియా హల్‌చల్ బ్యాచ్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×