BigTV English

Vizag news today : తప్పతాగి.. కారు చెట్టెక్కించి.. ఆ లేడీ డాక్టర్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

Vizag news today : తప్పతాగి.. కారు చెట్టెక్కించి.. ఆ లేడీ డాక్టర్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?
vishaka car accident

Vishaka: ఆమె ఓ లేడీ డాక్టర్. డాక్టర్ అయినంత మాత్రాన అలానే ఉండాలనే రూల్ ఏమీ లేదుగా. అందుకే, సరదాకో, చిల్ అవడానికో.. పబ్‌కు వెళ్లింది. పబ్‌కు వెళ్లాక పాలు తాగుతారా ఏంటి? మంచిగా మందేసింది. పెగ్గు మీద పెగ్గు కొట్టింది. ఫ్రెండ్స్‌తో చిందేసింది. అర్థరాత్రి వరకు ఫుల్‌గా తాగి తందనాలు ఆడింది. వాళ్ల జోష్ అన్‌స్టాపబుల్. కానీ, ఎంత సేపని వాళ్లని అలా తాగనిస్తారు చెప్పండి. పబ్ మూసేసే టైమ్ అయిందని లైట్స్ ఆఫ్ చేశారు. షట్.. అనుకుంటూ.. ఇక ఇంటికి పోదామని బయటకు వచ్చారు ఆ డాక్టర్ ఫ్రెండ్స్. వచ్చిన కారు సెల్లార్‌లో పార్క్ చేసిన విషయం గుర్తుకొచ్చింది. ద్యావుడా.. ఇప్పుడు సెల్లార్ నుంచి కారు తీయాలా.. అని కాసేపు తిట్టుకున్నారు. కానీ, తప్పదుగా. చేసేది లేక.. సెల్లార్‌ కెళ్లి.. కార్ స్టార్ట్ చేసింది ఆ లేడీ డాక్టర్.


అప్పటికే పబ్‌లో ఫుల్ తాగేసింది. లోపల గుర్రాలు పరుగెడుతున్నాయ్. మత్తు మజాగా అనిపిస్తోంది. కిక్కు గాల్లో తేలేలా చేస్తోంది. అదే జోష్‌తో కారు ఎక్స్‌లేటర్‌ను ఓ తొక్కుతొక్కేసింది. ఇంకేం.. కారు రేసుగుర్రంలా సెల్లార్ నుంచి రోడ్డు మీదకు దూసుకొచ్చింది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న బైకులను గుద్దేసింది. అదే స్పీడ్‌లో ఫుట్‌పాత్‌ను డ్యాష్ ఇచ్చి.. మరింత పైకెగిరింది కారు. ఎగిరి అలానే ఓ చెట్టును ఢీకొట్టి.. గాల్లో 45 డిగ్రీస్ యాంగిల్‌లో నిలబడిపోయింది. ఈ ఫోటో చూస్తే.. ఆ విషయం మరింత క్లియర్‌గా అర్థమవుతుంది. ఓ లుక్ వేయండి..

ఇదంతా విశాఖలో జరిగింది. కారుతో బీభత్సం చేశాక.. ఆ లేడీ డాక్టర్‌కు అప్పటికీ మత్తు దిగలేదు. కానీ, నిదానంగా కారు దిగేసింది. మరో కారులో అక్కడి నుంచి మెళ్లిగా జారుకుంది. విషయం తెలిశాక పోలీసులు వచ్చి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలే డాక్టర్ అంటున్నారు.. ఇక కేసు దర్యాప్తు ఎలా సాగుతుందో ఊహించుకోవచ్చు.


తాగిన బలుపుతో ఆ డాక్టర్ చేసిన డ్యామేజీకి 8 బైకులు షెడ్డుకు చేరాయి. మరి, వాటికి డబ్బులు ఇస్తారా? ఎవరి ప్రాణాలు పోలేదు కాబట్టి సరిపోయింది.. ఎవరికైనా ఏదైనా అయిఉంటే? తాగి వాహనం నడపొద్దని చిన్నపిల్లాడు కూడా చెబుతాడు. మరి పెద్ద డాక్టర్‌కు ఆ మాత్రం ఎరుక లేదా? ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్‌కు వెళితే.. సిగరేట్ తాగుతారా? మందు అలవాటు ఉందా? అని డాక్టర్ అడుగుతారే.. అలాంటిది ఆరోగ్యానికి హానికరమని తెలిసే.. ఓ డాక్టర్ అయి ఉండి.. పీకలదాకా తాగడమేంటి? పోనీ తాగారే అనుకున్నా.. తాగి కారు నడపడమేంటి? కారును ఏకంగా చెట్టెక్కించారంటే.. ఆ టైమ్‌లో ఎంత స్పీడ్ ఉండి ఉంటుందో? అంతగా.. మైండ్ పని చేయనంతగా మందు తాగాలా? లేడీ డాక్టర్లు కూడా పబ్‌ల మీద పడి మందుకొడుతూ.. కార్లతో గుద్దేస్తూ.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? హ్హ..

Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×