Vijay Politics:భారతదేశ ప్రభుత్వం అందించే అంత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలలో పద్మ అవార్డులు కూడా ఒకటి. ఇక ఇప్పుడు సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించిన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith) కి ‘పద్మభూషణ్’ అవార్డులు లభించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు అజిత్ కి పద్మభూషణ్ అవార్డు అందించిన నేపథ్యంలో విజయ్ చీప్ పాలిటిక్స్ ప్రయోగించారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అజయ్ కి పద్మభూషణ్.. విజయ్ ఓర్చుకోలేకపోయారా..?
ఇకపోతే కొంతకాలంగా అజిత్ కి, విజయ్ కి మధ్య సినిమా విషయంలోనే విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అజిత్ కి పద్మభూషణ్ అవార్డు లభించడంతో విజయ్ అభిమానులు ఆయన పాత విషయాలను బయటకు తీస్తున్నారు. ముఖ్యంగా విజయ్ అభిమానులు షాలినితో వివాహ జీవితానికి ముందు ప్రారంభ జీవితం గురించి, చాలా చీపుగా పోస్ట్లు పెట్టడంతో ఈ విషయం కాస్త అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఎవరైనా సరే ఇండస్ట్రీ లోకి వచ్చి సార్ స్టేటస్ ను అందుకోవడానికి ఎన్నో కష్టాలు పడి ఉంటారు. ఆ విషయాలను మర్చిపోయి, అజిత్ కి వచ్చిన పద్మభూషణ్ అవార్డును చూసి తట్టుకోలేక విజయ్ అభిమానులు ఇలా నీచమైన కామెంట్స్ చేస్తున్నారని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అజిత్ ను అవమానించడమే టార్గెట్..
ఇకపోతే హీరా – అజిత్ మధ్య ప్రేమాయణం గురించి వార్తలు రావడం ఇదేమి కొత్త కాదు.. గత కొంతకాలంగా కూడా ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ అజిత్ పద్మభూషణ్ అవార్డు అందుకున్న రోజే మళ్లీ ఈ జంట గురించిన వార్తలు వైరల్ చేయడం నిజంగా బాధాకరమనే చెప్పాలి. ప్రత్యేకించి విజయ్ ఇలా చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడని ప్రత్యేకంగా ఒక పీఆర్ టీమ్ తో ఇలా వార్తలు వైరల్ చేస్తున్నాడని అజిత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అజిత్ కెరియర్ లో ఇంతటి గుర్తుండి పోయే రోజుని కూడా విజయ్ అభిమానులు విమర్శనాత్మకంగా మార్చడం బాధాకరమని అభిమానులు సైతం వాపోతున్నారు.
విజయ్ సినిమాలు..
ఇక విజయ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన ‘జననాయగన్’ అనే సినిమా చేస్తున్నారు. తన కెరియర్లో 69వ సినిమాగా వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు విడుదలయ్యాయి. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. పలువురు స్టార్ సెలెబ్రిటీలు భాగమయ్యారు. పైగా విజయ్ కి ఇది చివరి సినిమా కావడం గమనార్హం. ఈ సినిమా తర్వాత పూర్తిగా విజయ్ రాజకీయ జీవితం వైపే మొగ్గు చూపుతున్నారు. రాజకీయ పార్టీని స్థాపించిన ఈయన వచ్చే ఏడాది ఎన్నికలలో ఈ పార్టీ ద్వారా పోటీ చేయబోతున్నారు.
ALSO READ:Priety Zinta: పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.. ఏమన్నారంటే..?