Priety Zinta:దివంగత లెజెండ్రీ నటులు ఎన్టీఆర్ (NTR), కృష్ణ (Krishna ) లాంటి దిగ్గజ సెలబ్రిటీల కాలంలో ఎలాగైతే, సెలబ్రిటీలు ఇండస్ట్రీలో తమకంటూ ఒక పేరు తెచ్చుకున్న తర్వాత రాజకీయాలలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు కూడా ఆ పరంపర అలాగే కొనసాగుతూ వస్తోంది.ముఖ్యంగా సినిమాల ద్వారా ఒక గుర్తింపును సొంతం చేసుకున్న ఎంతోమంది సెలబ్రిటీలు ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. యంగ్ సెలబ్రిటీలను మొదలుకొని సీనియర్స్ వరకు రాజకీయాల వైపు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. అయితే మరికొంతమంది మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉంటూ కెరియర్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా రాజకీయ రంగ ప్రవేశం చేస్తోంది అంటూ వార్తలు రాగా తాజాగా వీటిపై క్లారిటీ ఇవ్వడం జరిగింది.
రాజకీయ ఎంట్రీ పై ప్రీతి జింటాకు ప్రశ్న..
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా రాజకీయాల్లోకి రాబోతున్నారా .? ఆమె బిజెపిలో చేరబోతున్నారా..? పొలిటికల్ ఎంట్రీ గురించి ఆమె ఏమన్నారు..? సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎట్టకేలకు ఆమె క్లారిటీ ఇచ్చారు. అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ నటి, ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ యజమాని అయిన ప్రీతి జింటా రాజకీయాల్లోకి రావచ్చు అనే ఊహాగానాలు జోరుగా వ్యక్తమవుతున్న నేపథ్యంలో నటి స్వయంగా ఈ ఊహాగానాలకు చెక్ పెట్టింది. ఇటీవల ఒక ట్విట్టర్ యూజర్ కి ఆమె సమాధానం తెలిపింది. తాజాగా సోషల్ మీడియాలో #pzchat సెషన్ ను నిర్వహించిన ఈమె, అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా ఒక అభిమాని మీరు త్వరలో బిజెపిలో చేరబోతున్నారా? గత కొన్ని నెలలుగా మీ ట్వీట్లు అలాగే కనిపిస్తున్నాయని ప్రశ్నించారు.
ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన ప్రీతి జింటా..
దీనికి ప్రీతి జింటా స్పందిస్తూ.. సోషల్ మీడియా ప్రజలతో ఇదే సమస్య. ఈమధ్య అందరూ కూడా చాలా తీర్పులు చెప్పేస్తున్నారు .నేను గతంలో చెప్పినట్లుగా మహాకుంభమేళాకి వెళ్లడం.. నేను ఎవరో..? నా గుర్తింపు ఏమిటో గుర్తించడం అంటే నేను రాజకీయాల్లోకి వెళ్తున్నానని లేదా బిజెపిలోకి చేరుతున్నానని కాదు. భారతదేశ వెలుపల నివసించడం వల్లే నా దేశం నిజమైన విలువ నాకు తెలిసింది. ప్రతి ఒక్కరిలాగే నేను కూడా భారతదేశాన్ని, భారతీయ సంస్కృతిని ఎక్కువగా అభినందిస్తాను.ఇక రాజకీయాలు అంటారా.. నేను రాజకీయాల్లోకి రాను పలు రాజకీయ పార్టీలు నాకు టికెట్లు ఆఫర్ చేశాయి. కానీ నేను సున్నితంగా తిరస్కరించాను. ఎందుకంటే నేను రాజకీయ జీవితాన్ని కోరుకోవడం లేదు. గత కొన్నేళ్లుగా చాలా రాజకీయ పార్టీలు నాకు టికెట్లు, రాజ్యసభ సీటు ఆఫర్ చేశాయి.. అవి నాకు వద్దు. సైనికురాలు అని పిలవడం పూర్తిగా తప్పుకాదు.. ఎందుకంటే నేను ఒక సైనికుడి కుమార్తెను.. సైనికుడి సోదరిని కూడా..మేము సైనిక పిల్లలం.. సైనిక పిల్లలు కాబట్టే కొంచెం భిన్నంగా ఉంటాము. మేము భారతీయులం.. దేశభక్తి , మన దేశం పట్ల గర్వం మన రక్తంలోనే ఉంది అంటూ రాసుకొచ్చారు.