Chiranjeevi : మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఈయన సినిమాలకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రంలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు రామ్ చరణ్. అయితే నేడు రామ్ చరణ్ పుట్టినరోజు.. ఆయనకు సెలబ్రిటీల నుంచి మెగా ఫ్యామిలీ అలాగే అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. అంతేకాదు. పెద్ది మూవీ పోస్టర్ పై కామెంట్స్ చేశారు. చిరంజీవి ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం..
‘పెద్ది ‘ మూవీ పై చిరంజీవి కామెంట్స్..
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా సెలెబ్రేటీలు ఒక్కోక్కరు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్ పోస్ట్ మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. తాజాగా చిరంజీవి కూడా చరణ్ కు విషెస్ చెప్పారు. కొత్త సినిమా ‘పెద్ది’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు. పోస్టర్‌లో చరణ్ లుక్ చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ఇది తప్పకుండా సినీ ప్రియులకు ఇది ఒక మంచి ట్రీట్ కానుందని కోరుకుంటున్నా ” హ్యాపీ బర్త్‌డే మై డియర్ చరణ్”.. పెద్ది మూవీ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తుంది. నీలోని నటుడిని మరో కొత్త కోణంలో ఇది ఆవిష్కరించనుంది. అభిమానులకు పెద్ద పండగ అవుతుందని నేను నమ్ముతున్నా.. అని ట్వీట్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ మూడు వెరీ స్పెషల్..
‘పెద్ది’ మూవీ..
రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తుండటం విశేషం.. ఈ మూవీ నుంచి నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా మెగా ఫ్యాన్స్ కు ఫస్ట్ లుక్ పోస్టర్ తో అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ఆర్సీ16 చిత్రానికి ‘పెద్దీ’ టైటిల్ ను ప్రకటించారు. అలాగే ఉత్సుకతను రేకిత్తించేలా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. టైటిల్ క్యాచీగా ఉండటంతో సినిమాపై రీచ్ ను పెంచేస్తోంది. ఊరమాస్ లుక్ లో రామ్ చరణ్ దర్శనమిచ్చి సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను అమాంతం ఆకాశానికి ఎత్తేశారు.. మాస్ లుక్ లో కనిపిస్తున్న రామ్ చరణ్ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ పోస్టర్స్ తో సినిమా స్టోరీ ఏంటో చాలా వరకు అర్థమవుతుంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే..
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2025