BigTV English

Shahrukh Khan : ఐశ్వర్య ఛాన్స్ ఇవ్వలేదు… రొమాన్స్‌ పై బాద్ షా ఓపెన్ కామెంట్..!

Shahrukh Khan : ఐశ్వర్య ఛాన్స్ ఇవ్వలేదు… రొమాన్స్‌ పై బాద్ షా ఓపెన్ కామెంట్..!

Sharukh Khan.. బాలీవుడ్ (Bollywood)బాద్ షా గా గుర్తింపు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ అంతే కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు వసూలు చేస్తున్న హీరోగా కూడా రికార్డు సృష్టించారు. ఇకపోతే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ‘పఠాన్’ , ‘జవాన్’ , ‘డంకీ’ వంటి చిత్రాలతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఊపిరి పోసాయని చెప్పవచ్చు. గత కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ లేక సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ కి.. భారీ సక్సెస్ అందివ్వడమే కాకుండా ఊహించని కలెక్షన్స్ కూడా అందించారు షారుఖ్ ఖాన్.


ఇక ఇలా బాలీవుడ్ బాద్ షా గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన తన సినిమాల ద్వారా ఎంతోమంది హీరోయిన్లతో పని చేసినా.. ఆ హీరోయిన్ తో ఆ కోరిక మాత్రం తీరలేదు అంటూ తెగ బాధ పడిపోతున్నారు. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఏమిటా కోరిక ? అనే విషయానికి వస్తే.. ఆమె ఎవరో కాదు మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai). ఒకప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో పలు సినిమాలు వచ్చాయి. కానీ ఆ సినిమాల వల్ల తాను సంతృప్తి పడలేదని తెలిపారు షారుక్ ఖాన్. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరి కలయికలో సినిమాలు రాకపోవడానికి కూడా కారణం అదేనేమో అంటూ కూడా కామెంట్లు చేశారు.

ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది – షారుఖ్ ఖాన్


తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుఖ్ ఖాన్ ఐశ్వర్యరాయ్ తో ప్రస్తుతం నటించకపోవడం పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. “ఐశ్వర్యరాయ్ నేను కలసి నటించిన తొలి చిత్రం ‘జోష్’. అయితే ఆశ్చర్యమేమిటంటే ఇందులో ఐశ్వర్య నాకు చెల్లి పాత్ర చేసింది. ఆ తర్వాత మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండవ చిత్రం ‘దేవదాసు’. ఇందులో ఆమె నన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఇక ముచ్చటగా మూడో సినిమా ‘మొహబ్బతేం’.. ఇందులో ఐశ్వర్య దెయ్యం పాత్ర చేసింది. ఇక ఈ మూడు సినిమాలను బట్టి చూస్తే ఆమె నాతో ఎప్పుడు రొమాన్స్ చేసింది.. అందుకే ఈ విషయం నాకు చాలా బాధగా అనిపిస్తూ వుంటుంది. ఐశ్వర్య రాయ్ తో సినిమా అంటే ఒక రేంజ్ లో ఊహించుకుంటారు. అలాంటి ఆమెతో రొమాంటిక్ సన్నివేశాలు లేకపోవడం నిజంగా బాధాకరం” అంటూ తన బాధను ఎక్స్ప్రెస్ చేశారు షారుక్ ఖాన్.

అందుకే మా మధ్య గ్యాప్ ఏర్పడింది – షారుఖ్ ఖాన్

ఇప్పుడు గ్యాప్ ఏర్పడడం పై ఆయన మాట్లాడుతూ..” మా ఇద్దరి మధ్య తెలియకుండానే సినిమాలు ఆగిపోయాయి.మా కాంబినేషన్లో సినిమాలు చేయడానికి ఏ డైరెక్టర్ కూడా ముందుకు రావడం లేదు. అయితే మేము సినిమాల ద్వారా కలుసుకోకపోయినా.. అప్పుడప్పుడు ఫన్నీగా కలుస్తూ మాకు మేమే ఆశ్చర్య పోతుంటాము. సినిమాల ద్వారా, సినిమా కార్యక్రమాల ద్వారా ఒకప్పుడు కలుసుకునే మేము.. ఇప్పుడు మా పిల్లలను స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళుతూ ఎదురుపడినప్పుడు మాత్రమే ఒకరికొకరు కలుసుకుంటున్నాము” అంటూ సరదాగా కామెంట్లు చేశారు. షారుక్ ఖాన్. మొత్తానికి అయితే ఐశ్వర్యరాయ్ తో సినిమాలో నటించే అవకాశం వచ్చిన ఆమెతో రొమాన్స్ చేయలేకపోయానని తెగ బాధ పడిపోతున్నారు బాద్ షా.

Ram Charan: ఆ హీరోయిన్ తో ప్రేమలో పడ్డ రామ్ చరణ్.. కట్ చేస్తే..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×