Aditi Shankar: విజయ్ కనకమేడల దర్శకత్వంలో నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోలుగా నటించిన చిత్రం భైరవం(Bhairavam). ఈ సినిమాలో హీరోయిన్ గా నటి అదితి శంకర్(Aditi Shankar) కూడా నటించారు. ఇక ఈ సినిమా కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది… చాలా రోజుల తర్వాత ఈ ముగ్గురు హీరోలు వెండితెరపై సందడి చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు చిక్కుకున్నప్పటికీ సినిమానికి భారీ స్థాయిలో ప్రేక్షకులలోకి తీసుకువెళ్తున్న ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ముగ్గురిలో ఆ క్వాలీటిస్ నచ్చాయా…
ఇలా ఈ ముగ్గురు హీరోలు వివిధ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాల గురించి అలాగే వారి వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Sai Srinivas)తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈయనతో పాటు నటి అదితి శంకర్ కూడా పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ నుంచి ఈ ఇద్దరికి ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే యాంకర్ అదితి శంకర్ ను ప్రశ్నిస్తూ… ఈ సినిమాలో ముగ్గురు హీరోలు నటించారు కదా మీకు ఎవరు బెస్ట్ అనిపించింది? అంటూ ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నకు ఒక్కసారిగా షాక్ అయినా అదితి నాకు నేనే బెస్ట్ అంటూ ఫన్నీగా సమాధానం చెప్పారు. అనంతరం ఈమె ముగ్గురు హీరోల గురించి మాట్లాడుతూ వారిలో ఉన్న బెస్ట్ క్వాలిటీ తెలిపారు..
సినిమా ఛాన్సులు వద్దా?
ఈ సందర్భంగా అదితి శంకర్ మాట్లాడుతూ మనోజ్ ను(Manchu Manoj)అన్నయ్య అంటూ సంబోధించారు. మనోజ్ అన్నయ్య షూటింగ్ లొకేషన్లో ఉంటే చాలా సరదాగా ఉంటుందని తెలిపారు. ఇక రోహిత్ (Rohit)అన్న చాలా సైలెంట్ గా ఉంటారు కానీ ఆయన కూడా సరదా మనిషి అని తెలిపారు. ఆయన పంచులు ఎక్కువగా వేస్తారు. ఆయన ఏదో ఒకచోట ఉన్నప్పటికీ తన నవ్వుతో రియాక్ట్ అవుతూ ఉంటారని తెలిపారు. రోహిత్ అన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయన చాలా స్వీట్ అండ్ ఫన్నీ అంటూ సమాధానం చెప్పారు.
ఇక పక్కనే ఉన్న సాయి శ్రీనివాస్ గురించి కూడా మాట్లాడుతూ… సాయి సార్ ఏ విషయం గురించైనా చాలా డెడికేటెడ్ గా ఉంటారు, అలాగే అద్భుతమైన డాన్సర్ ఈయన డాన్స్ అద్భుతంగా ఉంటుంది అంటూ సాయి శ్రీనివాస్ గురించి ఓ రేంజ్ లో పొగిడేశారు. ఇలా ఈ ముగ్గురు హీరోల గురించి అదితి శంకర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె వ్యాఖ్యలపై నెటిజన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అదేంటి అదితి మనోజ్, నారా రోహిత్ లను పట్టుకొని అన్నయ్య అంటూ మాట్లాడవు నీకు ఇది తగునా అంటూ అభిమానులు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం వీరితో కలిసి మరో సినిమాలో నటించే ఛాన్స్ వద్దనుకుంటున్నారా? అందుకే వారిని అన్నయ్య అని పిలుస్తున్నారా అంటూ ఆ హీరోల అభిమానులు ఈమె వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.