Megastar Chiranjeevi: ఒకప్పుడు ప్రతి ఏడాది నంది అవార్డులు వచ్చేవి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కళాకారులకు కలలకు గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతో దానిని గద్దర్ అవార్డ్స్ పేరుగా మార్చారు. అయితే ఈ ఏడాది చాలామంది గద్దర్ అవార్డ్స్ ను పొందుకున్నారు. అందులో ఉత్తమ హీరోగా అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డు వచ్చింది. అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ అసలైన టాపిక్ ఏంటంటే తన మావయ్య మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ ను పూర్తిగా మర్చిపోయారు అని కొంతమంది అభిప్రాయం.
మెగాస్టార్ మేనల్లుడును మర్చిపోయారా.?
మామూలుగా ఎవరైనా సక్సెస్ కొడితే వారిని పిలిచి పేరుపేరునా సత్కరించడం ప్రశంసించడం మెగాస్టార్ చిరంజీవికి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. చిన్న సినిమాను కూడా తన భుజాల మీద మోస్తూ ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్తూ ఉంటారు. గద్దర్ అవార్డు వచ్చిన తరుణంలో అందరికీ ఒక ట్వీట్ తో కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. కానీ ఎక్కడా కూడా ఉత్తమ నటుడుగా అవార్డు వచ్చిన అల్లు అర్జున్ పేరును ఆ ట్వీట్లో మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఇది కొత్త అనుమానాలకు దారితీస్తుంది. ఈ రెండు ఫ్యామిలీలు మధ్య వివాదం ఉంది అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అవి నిజమే అని హింట్ ఇస్తున్నట్టు అనిపిస్తున్నాయి.
Hearty Congratulations to each and
every winner of the First #GaddarTelanganaFilmAwards
for the year 2024. 👏👏State recognition is extremely precious and motivating for any Artiste and Technician in the Creative fraternity.
It’s greatly encouraging to see the Government of…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 29, 2025