Bollywood..ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika) గత రెండు సంవత్సరాలుగా వరుస విజయాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘ఛావా’ సినిమాలతో ఏకంగా హిట్ కాదు హ్యాట్రిక్ సూపర్ హిట్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. రెండేళ్లలోనే ఈ స్థాయిలో విజయం ఏ హీరోయిన్ కూడా అందుకోలేదని చెప్పవచ్చు. అయితే ఇన్ని గొప్ప సినిమాలు చేసిన తర్వాత ఈమె బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటించిన ‘సికందర్’ సినిమాలో హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాలో చేసేటప్పుడు తండ్రి వయసు ఉన్న వ్యక్తితో రొమాన్స్ ఏంటి అంటూ చాలామంది విమర్శించారు కూడా.. అంతే కాదు అదే సమయంలో తెలుగులో నితిన్ (Nithin ) హీరోగా నటించిన ‘రాబిన్ హుడ్’ సినిమాలో అవకాశం వచ్చినా.. దానిని కాదనుకొని మరీ ఇందులో అవకాశాన్ని అందుకుంది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అయితే అటు రాబిన్ హుడ్ కూడా డిజాస్టర్ గా మిగిలిన మాట వాస్తవమే.. కానీ అది వేరే విషయం. ఇక్కడ తండ్రి వయసున్న వ్యక్తితో నటించడమే రష్మికకు నెగిటివ్గా మారిందని చెప్పవచ్చు. చాలామంది చాలా రకాల కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయంపై ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ (Ameesha Patel ) ఏజ్ గ్యాప్ అంటూ వస్తున్న వార్తలపై స్పందించింది.
ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటే.. అది విషయమే కాదు – అమీషా పటేల్
అసలు విషయంలోకి వెళ్తే సికందర్ సినిమాలో సల్మాన్ ఖాన్- రష్మిక మందన్న మధ్య ఏజ్ గ్యాప్ 31 సంవత్సరాలు తేడా ఉంది. దీంతో చాలా విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై నటి అమీషా పటేల్ స్పందిస్తూ.. సినిమాలలో నటీనటుల మధ్య ఏజ్ గ్యాప్ ఒక విషయమే కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు.అమీషా పటేల్ మాట్లాడుతూ.. ” నేను కూడా నాకంటే వయసులో చాలా పెద్ద హీరోలతోనే కలిసి పనిచేశాను. ‘గదర్ 2’ సినిమాలో సన్నీ దేవోల్ తో కలిసి నటించినప్పుడు ఆయనకు, నాకు మధ్య 20 సంవత్సరాల వ్యత్యాసం వుంది. కానీ తెరపై మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు నచ్చింది. దాంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే రష్మిక, సల్మాన్ ఖాన్ జోడిని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. నాకు సికందర్ సినిమా బాగా నచ్చింది. మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకుంటుంది. అయితే కారణం లేకుండా ఏ సినిమా కూడా విజయం సాధించదు కదా.. ఆ సినిమాలో కంటెంట్ ఉంది. దీంతో నటీనటుల మధ్య ఏజ్ గా అనేది సినిమా ఫలితానికి సంబంధమే లేదు” అంటూ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి అయితే సల్మాన్ ఖాన్ – రష్మిక మందన్న మధ్య ఏజ్ గ్యాప్ పై విమర్శలు వస్తున్నవేళ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
అమీషా పటేల్ కెరియర్..
ఇక అమీషా పటేల్ విషయానికి వస్తే.. మోడల్గా కెరియర్ ఆరంభించి, ఆ తర్వాత 2000 సంవత్సరంలో హిందీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక తెలుగులో బద్రి, నాని సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించింది . ఇక ఇప్పుడు హిందీ సినిమాలలో నటిస్తూ ఆకట్టుకుంటున్న ఈమె.. 2019లో బిగ్ బాస్ 13లో గెస్ట్ గా కూడా పాల్గొనింది.