BigTV English

KTR : కోకాపేట భూమ్.. అప్పుడు బీఆర్ఎస్ చేసిందేమిటీ?

KTR : కోకాపేట భూమ్.. అప్పుడు బీఆర్ఎస్ చేసిందేమిటీ?

KTR : కంచ గచ్చిబౌలి భూముల రచ్చ. వారం పాటు ఫుల్ హంగామా. HCU నుంచి సుప్రీంకోర్టు వరకు. ఎవరూ తగ్గేదేలే. ఆ భూమి ప్రభుత్వానిదే. కాకపోతే చెట్లు చదును చేయడంపైనే ఇష్యూ అంతా. స్టూడెంట్స్ మేం ఒప్పుకోం అంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మీ సంగతి చూస్తాం అని సర్కారును బెదిరిస్తున్నారు. సుప్రీంకోర్టు జోక్యంతో వివాదానికి తాత్కాలికంగా పుల్‌స్టాప్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఆ భూముల జోలికి ఎవరూ వెళ్లొద్దని ఆదేశించింది. నెక్ట్స్ ఏం చేద్దాం అంటూ ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించింది. ఆ ల్యాండ్‌లోకి అనుమతి లేదంటూ.. వెళ్తే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హుకూం జారీ చేశారు. ఇవీ ఇప్పటి వరకూ ఉన్న అప్‌డేట్స్.


కేసీఆర్ అమ్మిన భూముల సంగతేంది?

కంచ గచ్చిబౌలి భూముల మేటర్ కాసేపు పక్కనపెడితే.. ఆ 400 ఎకరాలపై ఎందుకింత రచ్చ చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. గత కేసీఆర్ పాలనలో అసలు భూములే అమ్మలేదా? అప్పుడెందుకు ఇంత గొడవ చేయలేదు? కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కోకాపేట ల్యాండ్స్ వరకు.. ఎన్ని వేల ఎకరాల్లో చెట్లు కొట్టేశారు? ఎన్ని వేల కోట్లకు అమ్మేసుకున్నారు? ఆనాడు బీఆర్ఎస్ చేసింది కరెక్ట్? ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నది తప్పా? అనే చర్చ నడుస్తోంది.


కేటీఆర్‌ను నిగ్గదీసిన నిరుద్యోగులు

ఆ సెగ లేటెస్ట్‌గా కోకాపేట, నియో పోలిస్ భూములను తాకింది. పదుల సంఖ్యలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగులు శుక్రవారం నియో పోలిస్ చౌరస్తాలో ఆందోళన చేశారు. ఆనాడు అడ్డగోలుగా అమ్మేసుకున్న భూములను ప్రభుత్వం తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. కోకాపేటలో భూములను వేలం వేసినప్పుడు పర్యావరణం గుర్తుకురాలేదా? అంటూ ఆనాటి మంత్రి కేటీఆర్‌ను నిగ్గదీసి అడిగారు నిరుద్యోగులు. కోట్లాది రూపాయల ముడుపులు తీసుకొని మై హోమ్, రాజపుష్ప లాంటి సంస్థలకు నియో పోలిస్ భూములను కట్టబెట్టారని వారు ఆరోపించారు. కోకాపేటలో ప్రైవేట్ కంపెనీల వ్యాపారం కోసం.. ఎకరా భూమి రూ.100 కోట్లకు ఎలా అమ్ముకున్నారని ప్రశ్నించారు. వాటి వాళ్ల నిరుద్యోగులమైన తమకు ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. అదే.. కంచ గచ్చిబౌలి భూములను ఐటీ కంపెనీలకు కేటాయించి ఉద్యోగ కల్పనకు రేవంత్ సర్కారు ప్రయత్నిస్తుంటే.. పర్యావరణం బూచీగా చూపించి కేటీఆర్ కుటిలనీతితో అడ్డుకుంటున్నారని నిరుద్యోగులు ఫైర్ అయ్యారు.

Also Read : అది అవ్వదమ్మా.. కేసీఆర్ అలా అనేశారేంటి?

కేసీఆర్ మాయం చేసిన అటవీ భూముల లెక్క ఇదిగో..

కేసీఆర్ పాలించిన పదేళ్ల కాలంలో ఏకంగా 4,28,437 ఎకరాల అటవీ భూమి మాయం అయిందంటూ లెక్కలు బయటకు వస్తున్నాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే 7,829 ఎకరాల అటవీ భూములను స్వాహా చేశారు. 2016 నుంచి 2019 వరకు ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్ కు అగెనెస్ట్‌గా తెలంగాణలో 12,12,753 చెట్లను తొలగించారని ఇటీవల పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. దేశంలోనే చెట్టను దారుణంగా నరికేసిన టాప్ 3 స్టేట్స్‌లో తెలంగాణ కూడా ఉంది. కొత్త సచివాలయ నిర్మాణం కోసమే వెయ్యికి పైగా చెట్లను నాశనం చేశారు. అందులో సుమారు వందేళ్ల చరిత్ర గల వృక్షాలు కూడా ఉన్నాయి. లెక్కలు ఇంత స్పష్టంగా ఉంటే.. ఆనాడు ప్రభుత్వ భూములను, అటవీ సంపదను అడ్డగోలుగా నాశనం చేసిన బీఆర్ఎస్ పెద్దలు.. ఇప్పుడు మాత్రం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల కోసం సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. పథకం ప్రకారం హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు రాకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.

Related News

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Big Stories

×