BigTV English

Arushi Sharma Wedding: ఆ డైరెక్టర్‌తో పెళ్లి పీటలెక్కిన హీరోయిన్ ఆరుషి శర్మ.. ఫొటోలు వైరల్!

Arushi Sharma Wedding: ఆ డైరెక్టర్‌తో పెళ్లి పీటలెక్కిన హీరోయిన్ ఆరుషి శర్మ.. ఫొటోలు వైరల్!

Arushi Sharma – Vaibhav Vishant Wedding Photos: ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువయ్యాయి. షూటింగ్ సమయంలో కలుసుకోవడం.. పరిచయం పెరగడం.. చివరికి ఆ పరిచయం ప్రేమగా మారడం.. ఆపై పెళ్లి చేసుకోవడం. ఇలా ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ కోవలోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది. సినీ నటి ఆరుషి శర్మ తాజాగా బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.


2020లో సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్‌లతో కలిసి ఇంతియాజ్ అలీ.. లవ్ ఆజ్ కల్‌లో తన అమాయకత్వం, అందం, అద్భుతమైన నటనతో చాలా మంది హృదయాలను దోచుకుంది నటి ఆరుషి శర్మ. అయితే ఇప్పుడు బ్యూటీ ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ వైభవ్ విశాంత్‌ను మ్యారేజ్ చేసుకుంది.

వీరి వివాహం హిమాచల్ ప్రదేశ్‌లోని జానేద్‌ఘాట్ సమీపంలోని ఒక హోటల్‌లో ఏప్రిల్ 18న మ్యారేజ్ జరిగింది. ఇరు కుటుంబాలు, అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఏప్రిల్ 17న కాక్‌టెయిల్ పార్టీ, ఆ తర్వాత ఏప్రిల్ 18న హల్దీ వేడుక జరిగింది. అయితే అదే రోజు అర్థరాత్రి ఆరుషి శర్మ – వైభవ్ విశాంత్ మ్యారేజ్ జరిగింది.


Also Read: చిరంజీవి భార్య సురేఖ ఆవకాయ పచ్చడి చేయడం.. ఉపాసన వీడియో తీయడం ఎంత బాగుందో..

అయితే అందుకు సంబంధించిన ఫొటోలు కానీ, వీడియోలు కానీ ఏవీ అప్పుడు బయటకు రాలేదు. కానీ రెండు రోజుల తర్వాత అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలిసి సెలబ్రెటీలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

వైభవ్ విశాంత్ ఎవరు..?

వైభవ్ విశాంత్ ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్. అతను 50 కంటే ఎక్కువ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు కాస్టింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. హైదర్, PK, తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా, బడే మియాన్ చోటే మియా, బద్లాపూర్ వంటి చిత్రాలకు వ్యవహరించాడు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వైభవ్ విశాంత్ ‘కాలా పాణి’ అనే వెబ్ సిరీస్‌కు సైతం కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ సిరీస్‌లో ఆరుషి శర్మ కీలక పాత్ర పోషించి మెప్పించింది.

ఆరుషి శర్మ:

ఆరుషి శర్మ 2015లో ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ‘తమాషా’ చిత్రంలో చిన్న పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్, దీపికా పదుకొనే హీరో హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత 2020లో ‘లవ్ ఆజ్ కల్‌’లో ఆమె నటించారు. ఈ చిత్రంలో ఆమె అందం, నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ బ్యూటీ చివరి మూవీ జితేంద్ర కుమార్ నటించిన జాదుగర్.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×