BigTV English

Amit Shah Assets: కారు లేదు.. కాకపోతే ఆ మూడు.. అమిత్ షా ఆస్తుల వివరాలు..!

Amit Shah Assets: కారు లేదు.. కాకపోతే ఆ మూడు.. అమిత్ షా ఆస్తుల వివరాలు..!

Amit Shah Assets Details: రాజకీయ నేతల జాతకాలు బయటపడేవి ఎన్నికల్లో మాత్రమే. ముందుగా నామినేషన్ దాఖలు చేసే సమయంలో అఫిడవిట్‌లో వాళ్లు ప్రస్తావించిన అంశాలు చూసుకుని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒకరికి అప్పులు, మరొకరికి ఇల్లు లేదని, మరొకరికి బంగారం లేదని రకరకాలు పేర్కొంటారు.


బీజేపీలో మోదీ తర్వాత వచ్చే పేరు అమిత్ షా. ఆయన్ని పార్టీలో నెంబర్‌ 2గా వర్ణిస్తారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ప్రస్తావించిన అంశాలు చూసినవాళ్లు నవ్వుకుంటున్నారు. తనకు కేవలం 36 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అమిత్‌షాకు సొంతంగా కారు లేదు. కాకపోతే మూడు క్రిమినల్ కేసులు ఉన్నాయి. వృత్తి సామాజిక కార్యకర్తగా ప్రస్తావించారు. 2019లో ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులను 30.5 కోట్లుగా వెల్లడించిన విషయం తెల్సిందే.

గుజరాత్‌లోని గాంధీ‌నగర్ నుంచి వరుసగా రెండోసారి బరిలోకి దిగుతున్నారు అమిత్ షా. ఆయనకు 20 కోట్ల విలువైన చరాస్తులు, 16 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. అలాగే 72 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు. 2022-23 ఏడాదికి 75 లక్షల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఇక అప్పుల విషయానికొస్తే.. 15 లక్షలు ఉన్నట్లు తెలిపారు.


Also Read: ఓడిపోతున్నామని తెలిసినా.. ఎందుకు కష్టపడాలి? : పీఎం మోదీ

అమిత్ షా వైఫ్ సోనాల్ ఆస్తులను కూడా అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఆమె ఆస్తులు విలువ అక్షరాలా 31 కోట్ల రూపాయలు. అందులో 22.46 కోట్ల చరాస్తులు, 9 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. ఆమె వార్షిక ఆదాయం 39.54 లక్షలు కాగా, అప్పులు మాత్రం 26.32 లక్షలున్నట్లు పేర్కొన్నారు.

Tags

Related News

Delhi Terrorists Arrested: ఢిల్లీలో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్

Traffic Challans: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఈ తేదీన ట్రాఫిక్ చలాన్ల మాఫీ? ఇలా చెయ్యండి

Prostitution Case: వ్యభిచారం కేసులో విటులు కూడా నేరం చేసినట్టే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Kerala Court Judgment: తల్లికి భరణం చెల్లించని వ్యక్తికి జైలు శిక్ష

Malaria vaccine: మలేరియాకు మందు.. భారత తొలి వ్యాక్సిన్‌కు హైదరాబాద్ నుంచే శ్రీకారం

Milk Prices: శుభవార్త.. తగ్గనున్న పాల ధరలు.. లీటర్‌కు ఎంత తగ్గిస్తారంటే

Big Stories

×