BigTV English

Ayesha Takia on Trolling: ప్లాస్టిక్ సర్జరీ ట్రోలింగ్ పై స్పందించిన హీరోయిన్ అయేషా టకీయా!

Ayesha Takia on Trolling: ప్లాస్టిక్ సర్జరీ ట్రోలింగ్ పై స్పందించిన హీరోయిన్ అయేషా టకీయా!

Ayesha Takia Reacts on Trolling: బాలీవుడ్ సీనియర్ నటి అయేషా టాకియా ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్ మోస్ట్ హీరోయిన్. వాంటెడ్, డోర్, టార్జాన్: ది వండర్ కార్, దిల్ మాంగే మోర్, సలామ్ -ఇ-ఇష్క, పాథ్‌షాల్ తదితర సినిమాలలో నటించి మంచి హిట్లు అందుకుంది. ఈ సినిమాలతో ఆమె ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తెలుగులోనూ ఓ సినిమా చేసి అందరినీ ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో అక్కినేని నాగార్జునతో ‘సూపర్’ మూవీలో నటించి మంచి గుర్తింపు అందుకుంది.


అయితే పెళ్లి తర్వాత అయేషా సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. ఇటీవల ఆయేషా తన కుమారుడు మికైల్‌తో కలిసి విమానాశ్రయంలో కనిపించిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను చూసిన అభిమానులు బాగా ఖుషీ అయ్యారు. అయినప్పటికీ ఆమె గుర్తుపట్టలేనంతగా కనిపించడంతో నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ చేయడం మొదలెట్టారు.

ఆయేషా టాకియా తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని.. అందుకే ఇన్ని రోజులు ఎక్కడా కనిపించలేదని ట్రోల్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ వార్తలపై ఆయేషా తాజాగా స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ను సేర్ చేశారు.


Read More: అయ్యయో నాగార్జున “సూపర్” హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి..?

ఈ మేరకు తన సోదరి ఆసుపత్రిలో ఉన్నందున రెండ్రోజుల క్రితం గోవాకు వెళ్లినట్లు తెలిపింది. ఇలాంటి బాధాకర సమయంలో తనపై ట్రోల్స్ చేస్తున్నందుకు ఆమె చాలా బాధపడుతున్నట్లు చెప్పింది. తాను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని పేర్కొంది. తాను జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నట్లు తెలిపింది.

అంతేకాకుండా తనకు సినిమాలపై ఎలాంటి ఆసక్తి లేదని తెలిపింది. తన గురించి పట్టించుకోవడం మానేసి.. తనను అలాగే ఉండనివ్వమని పేర్కొంది. ఈ మేరకు క్యాప్షన్‌లో అభిమానులు, శ్రేయోభిలాషులు తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×