BigTV English

Actress : ఆమె వల్లే ఇదంతా.. నూడుల్స్ తిని జీవితాన్ని నెట్టుకొచ్చాం… ఓ హీరోయిన్ ధీన కథ ఇది

Actress : ఆమె వల్లే ఇదంతా.. నూడుల్స్ తిని జీవితాన్ని నెట్టుకొచ్చాం… ఓ హీరోయిన్ ధీన కథ ఇది

Actress :ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా (Dia Mirza) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మోడల్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె, మాజీ మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ విజేత కూడా. ఎక్కువగా సమాజసేవ చేస్తూ పేరు దక్కించుకున్న ఈమె నిర్మాతగా కూడా రాణిస్తోంది. నిజానికి దియా మీర్జా పలు చిత్రాలలో నటించింది. కానీ హీరోయిన్ గా మాత్రం పేరు అందుకోలేకపోయింది . ఈ నేపథ్యంలోనే సమాజ సేవకురాలిగా పేరు సొంతం చేసుకున్న ఈమెకు 2012లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ 2012 గ్రీన్ అవార్డు లభించింది. ఎక్కువగా ‘భ్రూణహత్యలు’, ‘హెచ్ఐవి’ వంటి వాటిపై ప్రజలను జాగృతి పరిచే కార్యక్రమాలలో పాల్గొంటూ వీటిపై ఎంతోమందికి అవగాహన కల్పిస్తూ ఉంటుంది .


ఖరీదైన బట్టలు వేసుకున్నా.. నూడిల్స్ తిని బ్రతికే వాళ్ళం..

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దియా మీర్జా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టినప్పుడు తాను ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసుకుంది. ఆ సమయంలో చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడ్డాను, అని కుటుంబ సభ్యుల నుంచి సపోర్టు ఉండేది కాదని, చాలీచాలని డబ్బుతో జీవితాన్ని గడుపుతూ.. కడుపు నింపుకోవడానికి నూడుల్స్ తినేవాళ్ళం అంటూ చెప్పుకొచ్చింది దియా. దియా మాట్లాడుతూ..” 2000 సంవత్సరంలో లారా దత్త(Lara Dutta ), నేను, ప్రియాంక చోప్రా(Priyanka Chopra) మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్నాము. ప్రియాంక కి తన కుటుంబ సభ్యుల నుంచి చాలా సపోర్టు ఉండేది. కానీ అటు లారాదత్తకు ఇటు నాకు సపోర్ట్ చేయడానికి ఎవరు ఉండేవారు కాదు.ఇక మోడలింగ్లో రాణిస్తున్న సమయంలోనే లారా ముంబైలోని ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉండేది. ఇక నేను ముంబైకి వచ్చినప్పుడు ఆమె నాకు సహాయం చేసింది. అదే ఇంట్లో నాకు ఆశ్రయం కలిగించింది. చిన్న ఇల్లు అయినప్పటికీ మేమిద్దరం ఎంతో సర్దుకుపోయే వాళ్ళం. ఫ్యాషన్ షోలో పాల్గొని ఖరీదైన దుస్తులు ధరించినా.. ఒక్కోసారి చేతిలో చిల్లి గవ్వలేక కడుపునింపుకోవడానికి నూడుల్స్ తినేవాళ్ళం. మా పరిస్థితి చూసుకొని ఇద్దరం నవ్వుకునే వాళ్ళం కూడా.. వేసుకునేది ఖరీదైన దుస్తులు.. తినేది మాత్రం నూడు ల్స్ అని అనుకునే వాళ్ళం” అంటూ నాటి దీన కథను గుర్తు చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది దియామీర్జా.


దియా మీర్జా కెరియర్..

ఇకపోతే 2000 సంవత్సరంలో మిస్ ఇండియా పోటీలలో లారా దత్తా, ప్రియాంక చోప్రా, దియా మీర్జా ముగ్గురు పాల్గొనగా .. అందులో లారాదత్త విజేతగా నిలిచి కిరీటాన్ని అందుకుంది. ఇక ఫస్ట్ రన్నరప్ గా ప్రియాంక చోప్రా, సెకండ్ రన్నరప్ గా దియా మీర్జా నిలిచారు. ఇక దియా మీర్జా విషయానికి వస్తే 2001లో విడుదలైన’ రెహ్నా హై తేరే దిల్ మే’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దియా మీర్జా.. అనంతరం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది. ఇక 2021 లో విడుదలైన ‘ వైల్డ్ డాగ్’ అనే తెలుగు సినిమాలో కూడా ఈమె నటించారు. ఇక నటిగా, నిర్మాతగా, మోడల్గా, సంఘ సంస్కర్తగా మరింత పేరు సొంతం చేసుకున్నారు దియా మీర్జా.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×