సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల మీద భారాన్ని తగ్గించేందుకు చరపల్లిలో అత్యాధునిక రైల్వే స్టేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది భారతీయ రైల్వే సంస్థ. సుమారు రూ. 430 కోట్లతో దీనిని నిర్మించారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి రాకపోకలు కొనసాగించే పలు రైళ్లను చర్లపల్లి నుంచి నడిపిస్తున్నారు. ఇప్పుడు మరిన్ని రైళ్లు చర్లపల్లి నుంచి ఆపరేషన్స్ కొనసాగించబోతున్నాయి. సికింద్రాబాద్ నడిచే నాలుగు రైళ్ల కార్యకలాపాలను చర్లపల్లి టెర్మినల్ కు మార్చాలని సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయించింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో..
ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సుమారు రూ. 720 కోట్లతో ఈ రైల్వే స్టేషన్ ను పునరాభివృద్ధి చేస్తున్నారు. అక్కడ పనులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సికింద్రాబాద్ నుంచి నడిచే రైళ్లను చర్లపల్లి నుంచి రాకపోకలు కొనసాగించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇకపై చర్లపల్లి నుంచి నడిచే రైళ్ల వివరాలు
⦿ కృష్ణ ఎక్స్‌ప్రెస్
తిరుపతి- ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణ ఎక్స్‌ప్రెస్(17405) మార్చి 26 నుంచి సికింద్రాబాద్ కు బదులుగా చర్లపల్లిలో హాల్టింగ్ తీసుకోనుంది. తిరుపతి నుంచి ఉదయం 5.45 గంటలకు బయల్దేరే ఈ రైలు సాయంత్రం 7.49 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 6.15 నిమిషాలకు ఆదిలాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(17406) ఆదిలాబాద్ నుంచి రాత్రి 9.05 నిమిషాలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 4.45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. రాత్రి 9.40 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
⦿ కాకినాడ-లింగంపల్లి స్పెషల్ రైలు
కాకినాడ- లింగంపల్లి మధ్య నడిచే ప్రత్యేక రైలు (07446) ఏప్రిల్ 2 నుండి జూలై 1 వరకు చర్లపల్లి ద్వారా నడవనుంది. ఇది చర్లపల్లి నుంచి ఉదయం 7:20 గంటలకు బయలుదేరి 9:15 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07445) సాయంత్రం 6:30 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరి 7:30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
⦿ హడప్సర్ ఎక్స్ ప్రెస్
కాజీపేట నుంచి బయల్దేరే హడప్సర్ ఎక్స్ ప్రెస్ రైలు (17014) రాత్రి 8:20 గంటలకు చెర్లపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17013) తెల్లవారుజామున 3:00 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఏప్రిల్ 22 ఈ ప్రయాణాలు అమల్లోకి రానున్నాయి.
Read Also: ఇక నుంచి ఆ రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్ లో ఆగవు, కారణం ఏంటో తెలుసా?
⦿ జన్మభూమి ఎక్స్ ప్రెస్
లింగంపల్లి- విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ ప్రెస్ (12806) కూడా ఏప్రిల్ 25 నుండి చర్లపల్లికి మార్చబడుతుంది. ఈ రైలు ఉదయం 7:15 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6:05 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పునరాభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా చూసేందుక ఈ రైళ్లలో తాత్కాలిక మార్పులు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ఇకపై ఈ రైళ్లు సికింద్రాబాద్ కు బదులుగా చర్లపల్లిలో హాల్టింగ్ తీసుకోనున్నాయి.
Read Also: హోలీ వేళ ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు!
Read Also: సమ్మర్ లో వన్ డే టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ సమీపంలోఅదిరిపోయే డెస్టినేషన్స్ ఇవే.!