KTR Reaction: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగంపై పెదవి విరిచింది విపక్ష బీఆర్ఎస్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కేటీఆర్, ఇది గవర్నర్ ప్రసంగం కాదు గాంధీ భవన్ ప్రసంగమన్నారు.
గవర్నర్ స్పీచ్‌పై బీఆర్ఎస్ మాట
420 హామీల గురించి చెబుతారని అనుకున్నామని, గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించడం బాధాకరమన్నారు విపక్ష నేత. రైతులకు భరోసా ఇచ్చే ఒక్క మాట ప్రసంగంలో లేదన్నారు. రాష్ట్రంలో ఏ గ్రామంలో 25-30 శాతం వరకు రైతు రుణమాఫీ జరగలేదని పాత పల్లవిని ఎత్తుకున్నారు. రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ఈ సందర్భంగా మరోసారి ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగం పెండ్లిలో చావులో డప్పు కొట్టినట్లు ఉన్నది అని కేటీఆర్ అన్నారు.
గవర్నర్ నోటి వెంట అబద్దాలు మాట్లాడించడం తాము బాధపడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ వల్ల ఇవాళ రైతాంగం ఆందోళనలో ఉందన్నారు. 480 పైచిలుకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. వారికి ఉపశమనం కలిగించే మాట ఏ మాత్రం లేదన్నారు. నీళ్లు ఇస్తామని ఎక్కడ ప్రస్తావన లేదన్నారు. రుణమాఫీ అయినట్టు చెప్పించారని, గవర్నర్ స్థాయిని దిగజార్చారని తెలిపారు.
కాంగ్రెస్ తల్లిని సచివాలయంలో పెట్టారని, కాంగ్రెస్ తండ్రిని సచివాలయం బయటపెట్టారని దుయ్యబట్టారు కేటీఆర్. తాము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తల్లిని, తండ్రిని గాంధీ భవన్‌కు పంపిస్తామన్నారు. అప్పుడు ఎక్కడ పెట్టుకుంటారో మీరే పెట్టుకోవాలన్నారు. రైతు రుణమాఫీ 100 శాతం పూర్తి అయిందని, రైతులు సంతోషంగా ఉన్నారని గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని అన్నారు. సోషల్ జస్టిస్ అని గవర్నర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ALSO READ: మహాలక్ష్మి పథకం గేమ్ ఛేంజర్
ఇప్పటివరకు లక్షా 62 వేళ కోట్ల రూపాయలు అప్పులు చేశారని, బీఆర్ఎస్ హయాంలో నాలుగున్నర లక్షల కోట్లకు పైగా వ్యవసాయానికి ఖర్చు చేశామన్నారు. వరి ధాన్యం ఉత్పత్తి పెరిగిందని సిగ్గు లేకుండా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. 420 హామీల్లో ఒక్క హామీ అమలు చేయకుండానే ఇవ్వకుండా లక్షా 60 వేల కోట్ల రూపాయిలు అప్పులు చేశారని తెలిపారు.
కేవలం గవర్నర్ స్పీచ్‌పై కాకుండా దావోస్‌లో ఎంఈవోలపైనా నోరు విప్పారు కేటీఆర్. గతేడాది కుదుర్చుకున్న వాటిలో కనీసం 40 శాతం వచ్చాయా అని ప్రశ్నించారు. దీనిపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పెట్టుబడుదారులు మిగతా రాష్ట్రాలకు తరలి పోతున్నారంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు.
కేటీఆర్‌పై విప్ కౌంటర్
బీఆర్ఎస్ నేతలపై అదే స్థాయిలో రియాక్ట్ అయ్యింది ప్రభుత్వం. గవర్నర్ అంటే బీఆర్ఎస్ సభ్యులకు ఏ మాత్రం గౌరవం లేదన్నారు విప్ ఆది శ్రీనివాస్. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్ ప్రసంగిస్తుంటే ఓర్వలేక పోతున్నారని ఫైర్ అయ్యారు.
గవర్నర్ ప్రసంగాన్ని ప్రజలకు చేరకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీని హర్షించలేని బీఆర్ఎఎస్, ఇప్పుడు కేటిఆర్ ముసలి కన్నీరు కార్చడాన్ని తప్పుబట్టారు. కేసీఆర్ సభకు వచ్చి సూచనలు సలహాలు ఇవ్వాలని, కేవలం ఒక్క రోజు వచ్చి పోవడం సరికాదన్నారు. ఆనాడు ఆ నలుగురే.. ఈనాడు ఆ నలుగురే సభను అడ్డుకుంటున్నారని రుసరుసలాడారు.
ఇది గవర్నర్ ప్రసంగం కాదు గాంధీ భవన్ ప్రసంగం: కేటీఆర్
420 హామీల గురించి చెహుతారేమో అనుకున్నాం
గవర్నర్ తో అబద్ధాలు చెప్పించడం బాధాకరం
రైతులకు భరోసా ఇచ్చే ఒక్క మాట చెప్పలేదు
రాష్ట్రంలో ఏ గ్రామంలో 25 నుండి 30 శాతం వరకు రైతు రుణమాఫి జరగలేదు
రైతు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే… pic.twitter.com/DqKqB1AwGo
— BIG TV Breaking News (@bigtvtelugu) March 12, 2025