BigTV English

Actress Hema : ఖరీదైనా బంగ్లాలు, కార్లు.. నటి హేమకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయబ్బా..?

Actress Hema : ఖరీదైనా బంగ్లాలు, కార్లు.. నటి హేమకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయబ్బా..?

Actress Hema : టాలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ హేమ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో అక్కగా, వదినగా, తల్లిగా ఇలా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే ఈమె మరోవైపు వివాదాలను కూడా కోరి తెచ్చుకుంటుంది. అందుకే నిత్యం ఈమె పేరు వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల డ్రగ్స్ కేసు లో ఈమె పేరు ఎక్కువగా వినిపించింది. ఆ కేసు నుంచి బెయిల్ పై బయటకు వచ్చింది. కానీ సినిమాలను అనౌన్స్ చెయ్యలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈమె తన ఆస్తుల గురించి బయట పెట్టింది. ఇంతకీ ఆమె ఆస్తులు ఎన్ని కోట్లు ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం..


ఆస్తుల గురించి మొదటిసారి బయటపెట్టిన హేమ.. 

ఇండస్ట్రీలో నటులుగా కొనసాగుతున్న చాలా మంది స్వాతహాగా బాగానే ఆస్తులు ఉన్నవాళ్లే.. అందులో హేమ ఒకరు. ఇండస్ట్రీ లోకి హీరోయిన్ సెకండ్ హీరోయిన్ అలా అవ్వాలని రాగ అవకాశాలు మాత్రం సహాయక పాత్రలకు వచ్చాయి. అలా అన్ని రోల్స్ చేస్తున్న హేమ మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సినిమాల్లోనే అంతా సంపాదించారా అంటే కేవలం సినిమాలనే చేస్తుంటే సంపాదించలేము. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే ఆమెకు బాగా ఆస్తులు ఉన్నాయన బయట పెట్టింది. తన పుట్టింటి వాళ్లకు బాగా ఉందని మొదట్లో అవకాశల కోసం హైదరాబాద్ వచ్చినపుడు మా అమ్మ వంటి నిండా బంగారు నగలు, వడ్డాణం అవి పెట్టుకుని వచ్చేది. ఇక ఆమె భర్త కెమెరా మెన్ గా పనిచేసారు. యూట్యూబ్ థంబ్ నైల్స్ లో పెట్టినట్లు 200 కోట్లు, 300 కోట్లు ఏమి లేవని ఉన్నంతలో బాగానే ఉన్నట్లు తెలిపారు హేమ. చాలా ఏళ్లుగా ఆదాయ పన్ను కడుతున్నానని చెప్పింది.


హేమ పర్సనల్ లైఫ్.. 

క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ అసలు పేరు కృష్ణ వేణి అట.. తనది రాజోలు. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్ల కూడా బాగా వైరల్ అయిన హేమ ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచారు. ఆ మధ్య మా ఎన్నికల సమయంలో శివ బాలాజీ తో గొడవ చేయి కొరకడం వంటి విషయాల తో బాగా వైరల్ అయింది హేమ. ముక్కుసూటిగా సమాధానం చెబుతూ అందరికి కోపాన్ని తెప్పిస్తుంది. ఇక డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. సినిమాలకు కొంత దూరంగా ఉంటున్న హేమ నాకు సినిమాల్లో వచ్చే డబ్బుతోనే ఆస్తులు కూడబెట్టలేదు అంటూ ఇంటర్వ్యూ తెలిపారు. ఖరీదైన బంగ్లాలు, కార్లు చాలానే ఉన్నాయని హేమ ఆస్తుల గురించి బయటపెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. మరి ఇక సినిమాలు చేస్తుందో లేదో చూడాలి.. ఏది ఏమైనా కూడా సినిమాల్లో తన నటనకు ఒక మార్క్ ఉంటుంది. బ్రహ్మానందం లాంటి స్టార్స్ తో జోడిగా చేసింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×