Heroine : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అవకాశాలు రావాలంటే చెప్పులు అరిగేలా తిరిగే వాళ్లు. ఒకవేళ అవకాశం వెతుకుంటూ వస్తే అదృష్టం అని అంటారు. అయితే కొందరు ఒక్కో సినిమాతో తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ వరుస సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలోనే. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా హవాను కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ గజాలా ఒకరు.. అయితే ఈమె తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లో ఒక్క సినిమా పూర్తి కాకముందే సూసైడ్ అటెంప్ట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎందుకు అలా చేసిందో తెలియదు కానీ అప్పట్లో ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయ్యింది. అసలేం జరిగిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
హీరోయిన్ గజాల సినిమాలు..
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎంతో మంది హీరోయిన్లు కలలు కంటారు. తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. కొందరు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్లు అవుతారు. మరికొందరు హిట్ సినిమాల కోసం వెయిట్ చేస్తుంటారు. అలా ఇండస్ట్రీలోకి గంపెడు ఆశలతో అడుగు పెట్టిన హీరోయిన్ గజాల.. ఈమె గురించి తెలియని వాళ్లు ఉండరు. ఎన్టీఆర్ సినిమాల్లో నటించింది. జగపతిబాబు హీరోగా నటించిన నాలో ఉన్న ప్రేమ అనే సినిమాతో 2001లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది గజాల. అనంతరం వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నారు రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలా ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.
గజాల సూసైడ్ ఎందుకు అటెంప్ట్ చేసింది..?
హీరోయిన్ గజాల తన కెరియర్ మంచి పొజిషన్లో ఉన్న సమయంలోనే గజాల 2002వ సంవత్సరంలో సూసైడ్ అటెంప్ట్ చేశారు. 2002 జూలై 22 న హైదరాబాద్ లోనే ఓ అపార్ట్మెంట్ లో ఉన్న ఆమె నిద్ర మాత్రలు మింగింది. అది గమనించిన కొందరు ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకొని వెళ్లారట. దాంతో ఆమె బ్రతికిందని తెలుస్తుంది. గజాల సూసైడ్ చేసుకోవడానికి ప్రేమ వ్యవహారమే కారణం అంటూ వార్తలు వచ్చాయి. అయితే కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె హిందీ టీవీ నటుడు ఫైజల్ రజా ఖాన్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేసుకుంటుంది. పిల్లలు, ఫ్యామిలీ తో బిజీగా ఉన్న ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందేమో చూడాలి.. ఎందుకంటే ఈ మధ్య స్టార్ హీరోయిన్లు ఒక్కొక్కరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. మరి గజాలా ఇప్పటికి గజాలాకు అలాంటి ఆలోచన ఉందో, లేదో చూడాలి. ఏది ఏమైనా ఎన్టీఆర్ తో స్క్రీన్ ను షేర్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.