BigTV English

Actress Hema: ‘క్షణక్షణం’లో హీరోయిన్‌గా ఛాన్స్ అన్నారు.. వంద మందిలో నన్నే సెలక్ట్ చేసుకున్నారు: హేమా

Actress Hema: ‘క్షణక్షణం’లో హీరోయిన్‌గా ఛాన్స్ అన్నారు.. వంద మందిలో నన్నే సెలక్ట్ చేసుకున్నారు: హేమా

Actress Hema comments Kshana Kshanam Movie: బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో టాలీవుడ్ నటి హేమా గత కొంతకాలంగా మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు ఈ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని పలువురు నటులు పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల పోలీసులు నటి హేమా డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్‌షీట్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ తరుణంలో నటి హేమా ఓ ఇంటర్వ్యూలో ‘క్షణక్షణం’ మూవీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో వందలాది సినిమాల్లో నటి హేమా నటించిన మెప్పించింది. అయితే 7వ తరగతిలోనే రాజోలు నుంచి హైదరాబాద్ వచ్చేసిన నటి హేమా.. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని ఏ క్యారెక్టర్ అయినా సులువుగా చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి సిస్టర్ క్యారెక్టర్ వరకు ప్రమోషన్ వచ్చిందని, 1989లో అయ్యప్ప మహాత్యంలో నటించానని చెప్పుకొచ్చింది.

1990 వరకు వరుసగా సినిమాలు ఆఫర్లు వచ్చాయని, ఇక హీరోయిన్‌గా మాత్రమే చేయాలని అనుకునే విధంగా ఎదిగానని హేమా వెల్లడించింది. ఈ సమయంలోనే ‘క్షణక్షణం’ మూవీలో సెకండ్ హీరోయిన్ అని తీసుకున్నారన్నారు. వందమంది వస్తే నేనే సెలక్ట్ చేసుకున్నారన్నారు. వర్మ కేవలం నన్ను సెలక్ట్ చేశారని, ఈ సినిమాతోనే నేను మొదటిసారి విమానం ఎక్కినట్లు గుర్తు చేశారు.


వర్మపై అందుకేనా కోపం అని మీడియా ప్రశ్నించగా.. అలా ఏం కాదని, ఆయన చూడనాటికే భయంకరంగా కనిపించారన్నారు. ఆయన అలా కాదని, అతను కేవలం సినిమా గురించి ఆలోచిస్తున్నారని కొంతమంది ధైర్యం చెప్పారు. దీంతో సినిమాలో మంచి రోల్ నటించే అవకాశం వచ్చిందన్నారు. ఎప్పుడూ కూడా పేరు ఉండాలని అనుకునేలా ప్లాన్ చేసుకున్నానని చెప్పారు.

సినిమా ప్రారంభంలో హీరోయిన్స్ అవకాశం రాలేదని, కేవలం ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానన్నారు. కొంతమంది నాకంటే ముందు వచ్చిన హీరోయిన్లు ఎక్కడో ఉన్నారని, నా తర్వాత వచ్చిన హీరోయిన్లు కూడా కొంతమంది ఎక్కడో ఉన్నారో కూడా తెలియదన్నారు. అందుకే ఇంకా సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నానన్నారు. మొదటి నుంచి జాగ్రత్తగా ఉంటూ నటిస్తున్నానని చెప్పుకొచ్చింది.

సినిమా ప్రారంభంలో చాలా సైలెంట్‌గా ఉన్నానని, ఇప్పుడు కొంత మారినట్లు చెప్పారు. నా వివాహం తర్వాత చాలా ధైర్యం వచ్చిందని, నా బలం మా వారే అని తెలిపారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 7ఏళ్లు సినిమాకు దూరంగా ఉన్నానని, కొంతమంది ఈ సమయంలో డైరెక్టర్లుగా ఎదిగారన్నారు. అందుకే నాకు ధైర్యం వచ్చిందన్నారు.

Also Read:  సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.50 లక్షల చెక్కు ను అందజేసిన మెగా స్టార్

అందరూ నా వాళ్లే ఉండడంతో యాక్ట్ చేసేందుకు కృష్ణవంశీ వంటి వాళ్లు ఆఫర్లు ఇచ్చారన్నారు. మా ఫ్యామిలీ వాళ్ల అభిప్రాయం మేరకు సినిమాలకు దూరంగా ఉన్న నేను.. మళ్లీ మిత్రుల సహకారంతో సినిమాల్లోకి వచ్చినట్లు చెప్పారు. అంతకుముందు చాలా ఫర్పెక్ట్‌గా ఇంటిని కొనసాగించానని చెప్పారు. అయితే, ఒక్క సమయంలో రెండు లక్షల కోసం దాదాపు 15 రోజులు తిరగాల్సి వచ్చిందన్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×