BigTV English

Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి – వరద బాధితులకు రూ.50 లక్షలు విరాళం

Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి – వరద బాధితులకు రూ.50 లక్షలు విరాళం

Chiranjeevi meets Reventh Reddy: మెగా స్టార్ చిరంజీవి నటుడిగానే కాదు సామాజిక సేవ పట్ల అంకితభావంతో ఉంటారు. ఎందరో సినీ కళాకారులకు ఆర్థికంగా సాయం అందిస్తూ వస్తున్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా నిరుపేదలకు ఉచితంగా సాయం అందిస్తున్నారు. కరోనా సంక్షోభంలోనూ చిత్ర పరిశ్రమకు అండగా నిలిచారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 24 క్రాఫ్ట్ సినీ కళాకారులకు, జర్నలిస్టు కుటుంబాలకు రూ.2 వేల విలువ చేసే నిత్యవసర వస్తువులు పంపిణీ చేసి తన పెద్ద మనసును చాటుకున్నారు. మెగా స్టార్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది. తన మెగా సైన్యం కూడా సేవా భావంతో పనిచేస్తుంటారు. రాష్ట్రంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులలో ఉన్నా ఆర్థికంగా ఆదుకుంటూ వస్తున్నారు. గతంలోనూ హుద్ హుద్ తుపాను తాకిడికి విలవిలలాడిన వైజాగ్ ప్రజలకు భారీ సాయం అందించారు.


తండ్రీ కొడుకుల సాయం

మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. సినిమా పరిశ్రమలో కష్టాలలో ఉన్న ఏ నటుడికైనా ముందుగా చిరంజీవే సాయం అందిస్తుంటారు. అయితే ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో వచ్చిన వరదలతో అతలాకుతలమయ్యారు జనం. అటు ఆంధ్రాలో బుడమేరు, తెలంగాణలో మున్నేరు తాకిడికి అనేక వేల మంది నిరాశ్రయులయ్యారు. దీనికి స్పందించిన చిరంజీవి తెలంగాణకు రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. రామ్ చరణ్ కూడా మరో 50 లక్షలు ప్రకటించారు.


చిరు భరోసా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం కలిశారు. ఈ రెండూ కలిసి కోటి రూపాయల సాయం తెలంగాణ సీఎంకు చెక్కు రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఇద్దరూ కాసేపు ముచ్చటించారు. ఇకపై కూడా తాను ఎలాంటి విపత్తులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వానికి తన సాయం అందిస్తానని చిరంజీవి భరోసా ఇచ్చారు. చిరంజీవి అందించిన ఆర్థిక సాయానికి సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×