Jayaprada : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో జయప్రద కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి అందరి స్టార్ హీరోలతో నటించి స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. ఈ మధ్య హీరోయిన్లు రీఎంట్రీ ఇస్తున్నారు. కానీ ఈమె పెద్దగా సినిమాలపై ఆసక్తి చూపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.. తన పర్సనల్, ఫ్యామిలీ విషయాలను షేర్ చేస్తుంది. తాజాగా ఆమె ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తన సోదరుడు నటుడు రాజబాబు కన్నుమూశారని ఆమె పోస్ట్ లో రాసుకొచ్చారు. హైదరాబాద్ లో ఆయన నివాసంలో చనిపోయినట్లు షేర్ చేసింది.. ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె గురువారం, నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి, తన దివంగత సోదరుడి చిత్రాన్ని పంచుకుంది. తన సోదరుడి మరణవార్తను తన అనుచరులకు తెలియజేస్తూ ఆమె క్యాప్షన్‌లో ఒక గమనికను కూడా రాసింది. ఆమె ఇలా రాసింది, “నా అన్నయ్య శ్రీ రాజా బాబు మరణవార్తను మీకు తెలియజేస్తున్నందుకు చాలా బాధగా ఉంది, ఆయన ఈరోజు మధ్యాహ్నం 3:26 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు.. దయచేసి ఆయనను మీ ప్రార్థనలలో ఉంచండి. మరిన్ని వివరాలు త్వరలో పంచుకుంటాము.. ఆమె పోస్ట్ లో రాశారు. ఇక గతంలో, నటి సింగింగ్ రియాలిటీ షోలో కనిపించింది మరియు ‘డఫ్లీ వాలే డఫ్లీ బాజా’ పాట మొదట ‘సర్గం’ సినిమాలో భాగం కాదని వెల్లడించింది.. జయప్రద నటనకు ఎంతగానో ముగ్ధురాలై, ఆమె ‘డఫ్లీ వాలే డఫ్లీ బాజా’ చిత్రీకరణ రోజులకు తీసుకెళ్లింది. ఆ పాటకు సంబంధించి కొన్ని తెరవెనుక సంఘటనలను కూడా నటి పంచుకుంది.. ఆమె సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది..
నటి జయప్రద హీరోయిన్ గా తెలుగు, హిందీ లో ఎన్నో సినిమాలు చేశారు. వందల సినిమాల్లో నటించిన ఆమె ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుందని సమాచారం. 14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం. ప్రభాకరరెడ్డి ఈమెను చూసి జయప్రద అని నామకరణం చేసి 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వారా ఈమెను చిత్రసీమకు పరిచయం చేశాడు. అలా మొదలైన ఈమె సినీ ప్రస్థానం 2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో 300 కు పైగా సినిమాలలో నటించింది.. ఇప్పటికి ఆమె నటించిన సినిమాలకు క్రేజ్ తగ్గలేదు.
ఇక సినిమాలు మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉంటుంది. ఎన్టీఆర్ ఆహ్వానంతో 1994 అక్టోబర్ 10 న తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఈమె చంద్రబాబు నాయుడు పక్షంలో చేరి తెలుగు దేశం పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలైంది. 1996 ఏప్రిల్‌లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైంది. ఆ తరువాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వలన తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి, జయప్రద ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరింది..