OTT Movie : ఓటిటిలో మలయాళం సినిమాల హవా నడుస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. చక్కని కథలను సింపుల్గా ప్రజెంట్ చేయడంలో మలయాళం దర్శకులు ఒక అడుగు ముందే ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఇద్దరు భార్యాభర్తల చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
మనోరమ మ్యాక్స్ (Manorama Max) లో
ఈ మలయాళం ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘ఓరు కట్టిల్ ఓరు మురి’ (Oru kattil Oru Muri). 2025 లో రిలీజ్ అయిన ఈ మూవీకి బవకుట్టి శనవాస్. కే దర్శకత్వం వహించారు. ఈ సినిమా కధ మంచంతో పాటు, ముగ్గురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఈ మలయాళం మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ మనోరమ మ్యాక్స్ (Manorama Max) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
అక్కమ్మ సిటీలో ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఈమె తన ఇంట్లో ఉన్న మంచాన్ని చాలా ఇష్టపడుతూ ఉంటుంది. దానికి రంగులు వేసి రెడీ చేయడానికి ఇచ్చి చాలా జాగ్రత్తలు కూడా చెబుతుంది. అంతలా ఆ మంచాన్ని ఇష్టపడుతూ ఉంటుంది. మరోవైపు ఆమె ఇంట్లోనే మధుమతి అనే అమ్మాయి అద్దెకు ఉంటుంది. తనకి ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఉద్యోగం రాకుండా పోతుంది. ఈ విషయంలో మధుమిత చాలా బాధపడుతుంది. మరోవైపు అరవింద్ అనే వ్యక్తి క్యాబ్ నడుపుకుంటూ ఉంటాడు. ఇతనికి రూమ్ కూడా లేకపోవడంతో కారులోనే పాడుకుంటూ ఉంటాడు.అతన్ని కొందరు రౌడీలు తరుముతూ ఉంటారు. అక్కమ్మకి అరవింద్ తో ఒకసారి పరిచయం ఏర్పడుతుంది. అక్కమ్మ అతని మంచితనాన్ని గుర్తిస్తుంది. ఒక మధ్యవర్తి ద్వారా అతనికి రూమ్ అద్దెకు కావాలని తెలుసుకుంటుంది. తన ఇంటి మీదే ఉన్న మధుమతికి, ఒక అమ్మాయి పగలు పూట మాత్రమే ఇక్కడ ఉంటుందని అబద్ధం చెప్పి ఒప్పిస్తుంది. అరవింద్, మధుమతి ఇంట్లో పగలు కాసేపు పడుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. మధుమిత కూడా ఇంట్లో మనిషి ఉన్నారా లేదా అన్నట్టుగా ఉందని అనుకుంటుంది.
ఆ తరువాత ఒకసారి మధుమితని కొంతమంది వ్యక్తులు అటాక్ చేస్తారు. వాళ్ల నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లి పోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమె భయపడి తన సొంత ఇంటికి వెళ్లి పోతుంది. నిజానికి ఆమెకు ఇదివరకే పెళ్లి అవుతుంది. ఆమె భర్త ఎవరో కాదు, ఆమె ఇంట్లోనే అద్దెకు ఉండే అరవింద్. వీళ్లిద్దరి మధ్య చిన్నపాటి గొడవల కారణంగా అరవింద్ ను వదిలి సిటీకి వచ్చేస్తుంది మధుమిత. ఆ తర్వాత భర్త మంచితనాన్ని తెలుసుకొని తనకి దగ్గరవుతుంది. మరోవైపు అక్కమ్మ తన ఫ్లాష్ బ్యాక్ ని మధుమితకి చెప్తుంది. ఆమె మంచాన్ని ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతుందో తెలిసి మధుమిత షాక్ అవుతుంది. చివరికి అక్కమ్మ మంచాన్ని ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతుంది? మధుమితను చంపడానికి వచ్చింది ఎవరు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ‘ఓరు కట్టిల్ ఓరు మురి’ (Oru kattil Oru Muri) అనే ఈ మూవీని చూడండి.