BigTV English

MAA Movie Trailer: ‘మా’ ట్రైలర్.. ఒంటరిగా చూడకండి, ఉలిక్కిపడతారు.. చివరిలో ట్విస్ట్ మిస్ కావద్దు!

MAA Movie Trailer: ‘మా’ ట్రైలర్.. ఒంటరిగా చూడకండి, ఉలిక్కిపడతారు.. చివరిలో ట్విస్ట్ మిస్ కావద్దు!

MAA Movie Trailer..కాజోల్ (Kajol) ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్ నేచురల్ చిత్రం ‘మా’.. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఒక బిడ్డను దెయ్యం నుండి కాపాడుకునే తల్లి పాత్రలో కాజోల్ అద్భుతంగా నటించిందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. విశాల్ పురియా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా.. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల తేదీకి కేవలం నెల రోజులు కూడా లేనిపక్షంలో ప్రేక్షకులకు సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు ఒక్కొక్క అప్డేట్ వదులుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా అఫీషియల్ ట్రైలర్ ను సినిమా నుండి విడుదల చేశారు. దెయ్యం బారిన పడిన తన కుమార్తెను కాపాడుకునేందుకు ఒక తల్లి చేసిన యుద్ధమే ఈ కథ అని చిత్ర బృందం చెబుతోంది. ఇకపోతే ట్రైలర్ చూస్తే చిత్ర బృందం చెప్పినట్టుగానే ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో చాలా అద్భుతంగా సినిమాను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇందులో తనూజ దేవ్ గన్, రోనిత్ రాయ్, సుభద్ర సేమ్ గుప్తా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని దేవగన్ పిక్చర్స్ బ్యానర్ పై అజయ్ దేవగన్, జ్యోతి శాంతా సుబ్బరాయన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొత్తానికి అయితే ఆద్యంతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.


ఉత్కంఠ రేపుతున్న ‘మా’ ట్రైలర్..

ట్రైలర్ విషయానికి వస్తే.. కాజోల్ తన కూతురితో కలిసి ఒక అడవిలో కార్లో ప్రయాణం చేస్తూ ఉంటారు.తన కూతురు సడన్గా అమ్మ.. కడుపునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది అంటూ తన బాధను ఎక్స్ప్రెస్ చేస్తుంది. దాంతో కాజోల్ కొద్దిసేపు ఆగమ్మా.. దగ్గర్లో ఏదైనా హోటల్ వస్తే అక్కడ రెస్ట్ తీసుకుందువు అని చెబుతూ ఉండగానే.. సడన్ గా ఒక పాప దెయ్యం లాగా వచ్చి అడ్డుపడుతుంది. ఇక తర్వాత దాని నుండి తెరుకొని దగ్గర్లో ఉన్న బంగ్లాకు చేరుకుంటారు. అది ఒక దెయ్యం బంగ్లా.. ఆ విషయం తెలియక తల్లి కూతుర్లు ఇద్దరు అక్కడికి చేరుకుంటారు. కాజోల్ తన కూతురితో ఇది మనకు తెలియని ప్రదేశం.. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు అంటూ కాస్త రెస్ట్ రూమ్ కి వెళ్తుంది. అంతలోనే తన కూతురు దగ్గరికి ఒక అమ్మాయి ఆత్మ వచ్చి ఆ అమ్మాయిని దెయ్యాల స్థావరాల్లోకి తీసుకెళ్తుంది.అనుకోకుండా అక్కడ మిస్ అవుతుంది ఆ అమ్మాయి.. ఆ తర్వాత ఏం జరిగింది..? కాజోల్ తన కూతుర్ని వెతికి పట్టుకుందా..? సడన్గా ఆ పాప దెయ్యంలా ఎలా మారింది.? అసలు కాజోల్ కూతుర్ని ఆవహించిన ఆ దెయ్యం ఎవరు? ఆమె కూతుర్నే ఎందుకు టార్గెట్ చేసింది? ఇలా పలు ప్రశ్నలతో చాలా సస్పెన్స్ తో కూడిన అంశాలతో అద్భుతంగా తెరకెక్కించారు.


చివర్లో ఈ ట్విస్ట్ ఊహించలేదుగా..

చూసే ఆడియన్స్ మైండ్ సెట్ ని పాప కోసం కాజోల్ పోరాడే విషయాన్ని మాత్రమే ఆలోచించేలా చేసి.. సడన్గా లాస్ట్ లో ఎవరు ఊహించని ట్విస్ట్ ని చూపించి, డైరెక్టర్ ఆడియన్స్ కి గూస్ బంప్ తెప్పించారు. ఒక చెట్టు వేర్లు కాజోల్ ని చుట్టేసి ఆమె శరీరాన్ని విరిచేస్తూ ఉంటాయి. సడన్గా ఆమె కళ్ళు నీలంగా మారిపోతాయి. అయితే అందులో ఆమె లోకి కూడా దయ్యం వచ్చిందా లేక ఏదైనా దైవ శక్తి ఆమెలో ఆవహించిందా అన్నది సస్పెన్స్ గా వదిలేశారు. మొత్తానికైతే ఈ ట్రైలర్ ఆద్యంతం విపరీతంగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. మొత్తానికైతే మొదటిసారి చూసే ఆడియన్స్ ఎవరైనా సరే ఈ ట్రైలర్ ని ఒంటరిగా మాత్రం చూడకండి.. కచ్చితంగా ఉలిక్కిపడతారు అని చూసిన ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

also read:Deepika Padukone: దీపికా వర్సెస్ సందీప్.. హీరోయిన్ కి అండగా తమన్నా.. అసలేం జరిగిందంటే..?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×