Deepika Padukone:ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో దీపిక పదుకొనె (Deepika Padukone) వర్సెస్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అసలు విషయంలోకి వెళ్తే.. సందీప్ రెడ్డివంగా స్పిరిట్ (Spirit ) మూవీని ప్రభాస్ తో చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా దీపికా పదుకొనేను ఎంచుకున్నారు. అయితే సినిమా స్టోరీ మొత్తం పూర్తయ్యాక.. అందులో ఏ కంటెంట్ ఎక్కువగా ఉందని, పైగా అడిగినంత పారితోషకం ఇవ్వలేదని దీపిక తప్పుకున్నట్లు సమాచారం. వాస్తవానికి ఆమె ఈ సినిమా కోసం రూ.20 కోట్లు డిమాండ్ చేయడంతో అంత ఇచ్చుకోలేక ఆమెను సినిమా నుండి తప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఆమె స్థానంలో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti dimri) కేవలం రూ.4కోట్ల పారితోషకంతో రంగంలోకి దిగింది. ఇకపోతే సినిమా నుండి తప్పించారు అన్న కోపంతో దీపికా పదుకొనే తన పీ. ఆర్ టీం తరఫున సినిమాలోని కొంచెం స్టోరీని లీక్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మండిపడ్డ సందీప్ రెడ్డివంగా తన ఎక్స్ ఖాతా ద్వారా దీపిక పేరు ప్రస్తావించకుండా.. ఇదేనా మీ ఫెమినిజం, ఇదేనా మీ నిజాయితీ అంటూ మండిపడ్డారు. డర్టీ పీఆర్ టీమ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి సమయంలో దీపిక పెట్టిన పోస్ట్ కి తమన్నా లైక్ చేసిందని, దీపికాకు అండగా తమన్నా నిలిచింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
దీపికాకి అండగా తమన్నా..
ఇలా గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ తాజాగా ఆమెకు సంబంధించిన ఒక పోస్టుకు ఇన్స్టా లో తమన్నా లైక్ చేయడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో దీపికాకు ఆమె సపోర్ట్ చేస్తుంది అంటూ కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై మిల్కీ బ్యూటీ తమన్న (Tamannaah ) స్పందించారు. తన ఇన్ స్టా స్టోరీలో దీనిపై వివరణ కూడా ఇచ్చారు. “తనకు తానుగా పోస్టులను ఇంస్టాగ్రామ్ ఎలా లైక్ చేస్తుందో చెబితే బాగుంటుంది. ఎందుకంటే ఈ విషయం తెలియని కొంతమంది దీనిని పెద్ద వార్త లాగా ప్రచారం చేశారు. నేను పూర్తి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి” అంటూ క్యాప్షన్ పెట్టారు. దీంతో తమన్నా కావాలని లైక్ చేయలేదని స్పష్టం అవుతోంది.
అసలేం జరిగిందంటే?
అసలు విషయంలోకి వెళ్తే ఇప్పుడు పెద్ద ఎత్తున దీపిక, సందీప్ రెడ్డి వంగాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి యుద్ధం జరుగుతున్న వేళ.. దీపికాకు చెందిన ఒక పాత వీడియోని ఒక అభిమాని షేర్ చేశారు. అందులో..” ఆమె ఓవర్ టైం పనిచేయడం.. ప్రపంచంలో ఉన్న లింగ అసమానాతలతోపాటు మరికొన్ని విషయాల గురించి మాట్లాడారు.”ఈ పోస్టుకే తమన్నా లైక్ కొట్టినట్లు ఆ అభిమాని స్క్రీన్ షాట్ ని కూడా షేర్ చేశారు. దీంతో తమన్నా దీపికాకు సపోర్ట్ చేసింది అంటూ కొంతమంది కథనాలు వైరల్ చేశారు. ఇప్పుడు తమన్నా కూడా ఒక్క పోస్ట్ తో చెక్ పెట్టింది.