Actress Kajol: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున సినిమాలు షూటింగ్ జరుపుకునే ప్రదేశాలు ఏదైనా ఉంది అంటే అది రామోజీ ఫిలిం సిటీ(Ramoji Flim City) అని చెప్పాలి. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాష చిత్రాలు కొన్నిసార్లు హాలీవుడ్ సినిమాలు కూడా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతాయి అంటే ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో స్పష్టం అవుతుంది. వందల ఎకరాలలో సినిమా షూటింగులకు అనుగుణంగా ఏర్పాటు చేసిన రామోజీ ఫిలిం సిటీలో నిత్యం ఎన్నో సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటూ ఉంటాయి. అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీ చూడటానికి వచ్చే యాత్రికుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటుందని చెప్పాలి.
రామోజీ ఫిలిం సిటీ…
ఇలా సినిమా ఇండస్ట్రీకి తలమానికంగా మారిన రామోజీ ఫిలిం సిటీ గురించి తాజాగా బాలీవుడ్ నటి కాజోల్ (Kajol)చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. తాజాగా ఈమె నటించిన “మా” (Maa)అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా జూన్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె రామోజీ ఫిలిం సిటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జీవితంలో అక్కడికి రాను…
ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ.. రామోజీ ఫిలిం సిటీలోకి అడుగు పెట్టగానే తనకు ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ కలిగాయని తెలిపారు. అక్కడికి వెళ్లిన తర్వాత నేను ఉండటానికి సౌకర్యంగా ఫీల్ అవ్వలేదని, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నన్ను భయం వెంటాడుతూనే ఉందని తెలిపారు. రామోజీ ఫిలిం సిటీ ఒక భయంకరమైన ప్రదేశమని, తాను మరోసారి అక్కడికి వెళ్లాలని అసలు అనుకోలేదు అంటూ ఈమె తెలియజేశారు. అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు నెగెటివ్ వైబ్స్ వచ్చాయి. కొన్ని ప్రాంతాలు చాలా భయంకరంగా అనిపించాయని తెలిపారు.
రామోజీ ఫిల్మ్ సిటీ గురించి సంచలన విషయాలు వెల్లడించిన స్టార్ నటి కాజోల్!#RamojiFilmCity #Haunted #Hyderabad #Telangana #Kajol pic.twitter.com/wCWJWD2yrH
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) June 18, 2025
ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశం రామోజీ ఫిలిం సిటీ. మరోసారి తాను అక్కడికి రానని తెలిపారు. ఇలా భయంకరమైన ప్రదేశమని చెబుతున్నారే తప్ప అక్కడ తనకి ఎదురైన సంఘటనలు గురించి మాత్రం కాజోల్ చెప్పటానికి ఇష్టపడలేదు. మరి రామోజీ ఫిలిం సిటీ గురించి ఈమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏంటో తెలియదు కానీ ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కాజోల్ ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఇక ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వరుస సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ‘మా’ అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రామోజీ ఫిలిం సిటీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతలా ఈమెను భయపెట్టిన సంఘటనలు ఏం జరిగి ఉంటాయని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Rajamouli: రాజమౌళి ముందు తోక జాడిస్తే అంతే సంగతులు.. దారుణ స్థితిలో ఆ హీరో?