Thumb Sucking in children: పిల్లలు నోట్లో వేలు పెట్టుకోవడం సర్వసాధారణం. చాలా మంది చిన్న పిల్లలు వారి బొటనవేలుని ఎప్పుడు నోట్లో పెట్టుకుని ఉంటారు. పడుకున్న, ఆడుకున్నా వారి చేతి వేలి నోటిలోనే ఉంటుంది. చిన్న పిల్లలను చూస్తే ముద్దుగా అనిపిస్తుంది అలా అని వారి అలవాట్లను కామన్‌గా తీసుకోవద్దు. పిల్లు వారి వ్రేలుని నోట్లో పెట్టుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని పలు వైద్య నిపుణులు చెబుతున్నారు.
దంతాలు చప్పరించడం వల్ల దంతాలు సరిగ్గా రాకపోవడంతో పాటు దవడ సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. అంతేకాకుండా ఇది ఆర్థోడాంటిక్ చికిత్స అవసరమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు నోట్లో వేలు పెట్టుకోవడం వల్ల దానిలోని బ్యాక్టీరియా శరీరంలోకి చేరి అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. నోటి చుట్టు ఉన్న చర్మం తడిగా ఉండటం వల్ల చర్మం పొడిబారటం, పగుళ్లు రావడం వంటి సమస్యలు వస్తాయి. దీని వల్ల పిల్లల నాలుక, నోటి కండరాల అభివృద్దికి అడ్డుగా నిలిచే ప్రమాదం ఉంటుంది, అలాగే పదాలను సరిగ్గా పలకక పోవడం, మాట్లాడటంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి.
పిల్లల చేతులు చాలా మురికిగా ఉండటం వల్ల వారు వేళ్లు నోట్లో పెట్టుకున్నప్పుడు చేతులపై ఉండే బ్యాక్టీరియా లేదా క్రిములు నోటిలోకి ప్రవేశిస్తాయి. దీరి కారణంగా బిడ్డకు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు లేదా ఇతర జీర్ణ సమస్యలు రావచ్చంటున్నారు. దీంతో పాటు తరచుగా నోటి పూతలు లేదా గొంతు నొప్పి వంటి కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు.
దీర్ఘకాలంగా ఈ అలవాటు కొనసాగితే చర్మంపై చిన్న గాయాలు ఏర్పడి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా బొటనవేలు నోట్లో పెట్టుకోవడం వల్ల బలహీనపడుతుంది. కావున ఈ అలవాటును నియంత్రించడానికి పిల్లలకు గట్టిగా చెప్పాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే వారు మానసికంగా ఇబ్బంది పడతారు. అందుకే ప్రేమగా వారి అలవాటును మానిపించేందుకు ట్రై చేయండి. అలాగే బొమ్మలు, పుస్తకాలతో దృష్టి మళ్లించడం అవసరం. చేదు రసాయనాలను వాడటం, చేతి తొడుగులు తొడిగించడం కూడా దీని నివారణకు సహాయపడుతుంది.
Also Read: జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా.. అయితే వీటిని తప్పక తినండి..
పిల్లల బొటనవేలు పీల్చే అలవాటు వారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ అలవాటు చాలా కాలం పాటు కొనసాగితే, దంతాలు, దవడ అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. దీని వలన పిల్లలలో మాట్లాడటం, తినడంలో కూడా సమస్యలు వస్తాయి.
ఈ అలవాటును మాన్పించడానికి చేతులకు వేపాకు రసం రుద్దండి. ఇలా చేయడం వల్ల ఈ అలవాటును త్వరగా మానేస్తారు. పిల్లల కొన్ని సమయాల్లో మాత్రమే వేళ్లు చప్పరిస్తారు. కొందరు నిద్రపోయే ముందు వేలు పెట్టుకుంటారు. మరికొందరు ఏదైనా ఒత్తిడి, టెన్షన్‌లో ఉన్నప్పుడు ఇలా చేస్తుంటారు. ఆ సమయాల్ని గమనించి.. వాటి పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలుంటాయని నిపుణులు అంటున్నారు.