BigTV English

F-35B Fighter Jet: మూడు రోజులైనా కదలని బ్రిటన్ ఫైటర్ జెట్, ఇంతకీ ఏమైనట్టు?

F-35B Fighter Jet: మూడు రోజులైనా కదలని బ్రిటన్ ఫైటర్ జెట్, ఇంతకీ ఏమైనట్టు?

Advanced Fighter Jet: ప్రపంచ వ్యాప్తంగా అత్యధునిక యుద్ధ విమానాలు ఉన్న దేశాలలో బ్రిటన్ ఒకటి. ఈ దేశం దగ్గర అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్ లు ఉన్నాయి.  వాటిలో ఒకటి ఎఫ్-35 బీ. ఈ యుద్ధ విమానం సాంకేతిక సమస్యలతో గత మూడు రోజులుగా కేరళలోని తిరువనంతపురం ఎయిర్ పోర్టులోనే ఉంది. ప్రస్తుతం ఈ యుద్ధ విమానం బ్రిటన్ దేశానికి చెందిన HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్స్ స్ట్రయిక్ గ్రూపులో ఉంది. ఈ ఫైటర్ జెట్ ఇటీవల ఇండో- పసిఫిక్ రీజయిన్ లో ఇండియన్ నేవీతో కలిసి సంయుక్త యుద్ధ విన్యాసాలు చేసింది.


అత్యాధునిక ఫైటర్ జెట్ లో సాంకేతిక సమస్యలు

యుద్ధ విన్యాసాల తర్వాత బ్రిటన్‌ రాయల్‌ నేవీకి చెందిన ఈ ఫైటర్ జెట్ లండన్ కు వెళ్లిపోవాల్సి ఉంది. అయితే, ఆ ఫైటర్ జెట్ లో ఇంధనం తగ్గడంతో ఆదివారం నాడు తిరువనంతపురం ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అయితే, ఆ జెట్ లో ఫ్యూయెల్ బాగానే ఉందని అధికారులు గుర్తించారు. సాంకేతిక సమస్యలతోనే ఆ యుద్ధ విమానం ఆగిపోయినట్లు తేల్చారు. ఇప్పటికే టెక్నికల్ టీమ్ ఆ జెట్ లోని సాంకేతిక సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో గత 72 గంటలుగా ఆ ఫైటర్ జెట్ కేరళలోనే చిక్కుకుపోయింది.


కొనసాగుతున్న రిపేర్లు

బ్రిటన్ కు చెందిన టెక్నికల్ టీమ్ ఫైటర్ జెట్ కు రిపేర్లు చేస్తున్నారు. ఇవి పూర్తి అయిన తర్వాత HMS ప్రిన్స్ ఆఫ్‌ వేల్స్‌ పైకి తరలించాలని భావిస్తున్నారు. భారత్ లో ఓ విదేశీ ఫైటర్ సెట్ ఇన్ని రోజులు నిలిచిపోవడం ఇదే తొలిసారి. అదీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్ ఆగిపోవడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. ఎఫ్‌-35 లాంటి పిఫ్ట్ జెనరేషన్ స్టెల్త్‌ జెట్‌ మోరాయించడం అసాధారణ విషయం అంటున్నారు ఏవియేషన్ నిపుణులు. అత్యవసర పరిస్థితులలో జెట్ విమానం మొరాయిస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటున్నారు. బ్రిటన్ దగ్గర ఉన్న ఈ మోడల్ ఫైటర్ జెట్ లు అన్నింటినీ మరోసారి పరీక్షించాలని సూచిస్తున్నారు. మరోవైపు ఈ యుద్ధ విమానానికి ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫైటర్‌ జెట్‌ కు సీఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటీ కల్పిస్తోంది.

Read Also: విమానంలో ఎకానమీ, బిజినెస్ క్లాస్ మధ్య ఇంత తేడానా? మీరు అస్సలు నమ్మలేరు!

ఏంటీ ఫైటర్ జెట్ ప్రత్యేకత?

నిజానికి లేటెస్ట్ ఫైటర్ జెట్ షార్ట్‌ టేకాఫ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు, వర్టికల్‌ గా ల్యాండింగ్‌ అవుతుంది. ఇలాంటి విమానాలు అమెరికా సహా కొద్ది దేశాల దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర కూడా ఇలాంటి ఫైటర్ జెట్ లు ఉన్నాయి. అయితే, వేరియెంట్ మాత్రం వేరేది. ఈ ఫైటర్ జెట్లతోనే ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది.

Read Also: బద్దలైన అగ్నిపర్వతం, తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం!

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×