Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా, వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ తెలుగులో మాత్రమే కాకుండా, పాన్ ఇండియా పాన్ వరల్డ్ స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్నారు దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి(S.S. Rajamouli). కెరియర్ మొదట్లో అసిస్టెంట్ ఎడిటర్ గాను , అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలైన ఈయన ప్రయాణం బుల్లితెర సీరియల్స్ కు డైరెక్టర్ గా పనిచేశారు. అనంతరం ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో దర్శకుడిగా అవకాశం అందుకున్నారు. తన మొదటి సినిమాతోనే తానేంటో నిరూపించుకొని వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేశారు. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో రాజమౌళి కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు.
సినిమాల విషయంలో నో కాంప్రమైజ్..
వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గాను, RRR సినిమాతో పాన్ వరల్డ్ డైరెక్టర్ గాను గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో (Mahesh Babu)సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా రాజమౌళి గురించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాల విషయంలో రాజమౌళి ఎంత నిక్కచ్చిగా ఉంటారో అందరికీ తెలిసిందే.
నటుడు ప్రకాష్ రాజ్…
ఈ విషయం గురించి ఇప్పటికే తనతో పని చేసిన సెలబ్రిటీలు ఎన్నో సందర్భాలలో తెలియచేశారు. ఇకపోతే రాజమౌళి ముందు ఏ హీరో అయినా లేదా ఏ సెలబ్రిటీ అయినా తోక జాడిస్తే మాత్రం ఇక వారికి ఇండస్ట్రీలో తన సినిమాలలో కెరియర్ ఉండదని చెప్పకనే చెబుతుంటారు. ఇలా ఈయన ఒక నటుడిని పూర్తిగా పక్కన పెట్టేసారనే తెలుస్తుంది. మరి రాజమౌళి తన సినిమాలకు దూరంగా పెట్టిన ఆ నటుడు ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj)అని చెప్పాలి.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలలో ప్రకాష్ రాజ్ చేసే పాత్రలు ఎన్నో ఉన్నాయి కానీ ఆయనకు మాత్రం ఈయన అవకాశం ఇవ్వలేదు. రాజమౌళి డైరెక్షన్ లో రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు(Vikramarkudu) సినిమాలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమా మినహా మిగిలిన ఏ సినిమాలలో కూడా ప్రకాష్ రాజ్ కనిపించలేదు. ఇలా ప్రకాష్ రాజ్ రాజమౌళి సినిమాలలో నటించకపోవడానికి కారణం విక్రమార్కుడు సినిమా షూటింగ్ సమయంలో షూటింగుకు ప్రకాష్ రాజ్ ఆలస్యం రావడంతో రాజమౌళి ప్రశ్నించారట. ఇలా రాజమౌళి ప్రశ్నించడంతో ఆయన సెటైరికల్ సమాధానం చెప్పడంతో అది రాజమౌళికి నచ్చలేదని, అందుకే అప్పటి నచి తన సినిమాలకు ప్రకాష్ రాజ్ ను దూరం పెట్టారని తెలుస్తుంది. లేదంటే రాజమౌళి సినిమాలలో ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి ప్రకాష్ రాజ్ మరింత పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకునేవారు.ఇక ప్రకాష్ రాజ్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఈయన వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Manchu Manoj: దాసరి గారు ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు… పెద్దదిక్కు ఎవరూ లేరా?