BigTV English

Tollywood Updates: మరోసారి జంటగా సందడి చేయనున్న లయ శివాజీ, వైరల్ ఫొటోస్‌

Tollywood Updates: మరోసారి జంటగా సందడి చేయనున్న లయ శివాజీ, వైరల్ ఫొటోస్‌

Actress Laya, Hero Sivaji, Who Will Make Noise As A Couple Once Again: టాలీవుడ్ హీరో శివాజీ, నటి లయ కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. అంతేకాదు జోడీగా నటించిన సినిమాల్లో మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా వంటి మూవీస్ ఆడియెన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాదాపు 14 ఏళ్ల తరువాత ఈ జోడీ మరోసారి టాలీవుడ్‌ ఆడియెన్స్‌ని అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఇక శివాజీ, లయ హీరోహీరోయిన్లుగా ఓ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రూపుదిద్దుకునేందుకు రెడీ చేస్తున్నారు మేకర్స్.


ఇక ఈ మూవీకి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడిగా ఇదే తన ఫస్ట్ మూవీ. శివాజీ ఈ మూవీకి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. శివాజీ సొంత బ్యానర్‌పై శ్రీ శివాజీ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన ఓపెనింగ్ ప్రోగ్రాం హైదరాబాద్‌లో జరిగింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు క్లాప్ కొట్టగా, శివాజీ కొడుకు రిక్కి కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. ఈ ఓపెనింగ్‌కి స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముహూర్తం షాట్‌కి దర్శకత్వం పోశించారు.

Also Read: ఆకట్టుకుంటున్న ‘క’ మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో..


ఇక ఈ మూవీకి ఇంకా టైటిల్ మాత్రం ఖరారు చేయలేదు. ఆగస్ట్ 20 నుంచి ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ఇతర తారాగాణం వంటి డీటెయిల్స్‌ని త్వరలో అనౌన్స్ చేయనున్నారు. అంతేకాదు లయ, శివాజీ ఇద్దరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో వారి ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు.గతంలో వీరి కాంబోలో వచ్చిన మూవీస్ అన్ని సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ మూవీ కూడా హిట్ అవ్వడం పక్కా అని భావిస్తున్నారు మూవీ లవర్స్. ఇక వీరిద్దరి జోడీ ఈ మూవీకి పెద్ధ హైలైట్ అంటూ చాలామంది భావిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×