E-Paper
Advertisement

Ram Gopal Varma: రాజమౌళి తర్వాత నువ్వే గ్రేట్.. ‘పెద్ది’ గ్లింప్స్‌పై ఆర్జీవీ రివ్యూ

Ram Gopal Varma: రాజమౌళి తర్వాత నువ్వే గ్రేట్.. ‘పెద్ది’ గ్లింప్స్‌పై ఆర్జీవీ రివ్యూ
Advertisement

Ram Gopal Varma: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎన్‌టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ జీవితాలను మార్చేసింది. అందుకే ఈ ముగ్గురి దగ్గర నుండి వచ్చే అప్‌కమింగ్ సినిమాలపై కేవలం ఇండియన్ మూవీ లవర్స్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా ఏర్పడ్డాయి. కానీ రామ్ చరణ్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చేసిన సినిమాతో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాడు. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో కలిసి సినిమా చేసినా అది ఊహించినంత రేంజ్‌లో విజయం సాధించలేకపోయింది. అందుకే ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న ‘పెద్ది’పై ప్రేక్షకుల ఫోకస్ పెరిగింది. తాజాగా విడుదలయిన ఈ మూవీ గ్లింప్స్‌పై రామ్ గోపాల్ వర్మ సైతం రియాక్ట్ అయ్యారు.

మైండ్ బ్లాక్ గ్లింప్స్

Advertisement

సుకుమార్ అసిస్టెంట్‌గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు బుచ్చి బాబు. ఇప్పటికే ‘ఉప్పెన’ అనే సినిమాతో దర్శకుడిగా మారి మొదటి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో దర్శకుడిగా బుచ్చి బాబు టాలెంట్ ఏంటో ప్రేక్షకులకు అర్థమయ్యింది. కానీ తన రెండో సినిమాకే రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం వస్తుందని ఎవరూ ఊహించలేదు. బుచ్చి బాబు చెప్పిన కథ నచ్చి తనతో ‘పెద్ది’ చేయడానికి ఒప్పుకున్నాడు రామ్ చరణ్. మొదట్లో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంతగా అంచనాలు లేకపోయినా.. తాజాగా విడుదలయిన గ్లింప్స్ చూసిన తర్వాత చాలామంది మైండ్ బ్లాక్ అయ్యింది. అలాగే ఆర్జీవీ కూడా ఇది చూసి షాకయ్యి ట్వీట్ చేశాడు.

ట్రిపుల్ సిక్సర్

Advertisement

‘పెద్ది సినిమా అసలైన రియల్ గేమ్ ఛేంజర్ అనడంలో సందేహం లేదు. ఇందులో రామ్ చరణ్ (Ram Charan) కేవలం గ్లోబల్ స్టార్‌లాగా కాదు.. యూనివర్సల్ స్టార్‌లాగా అనిపిస్తున్నాడు. రాజమౌళి తర్వాత మరే దర్శకుడు రామ్ చరణ్ సత్తాను అర్థం చేసుకున్నాడని నేను అనుకోలేదు. కానీ ఆ పని నువ్వు చేశావు బుచ్చి బాబు. కచ్చితంగా మీ సినిమా ట్రిపుల్ సిక్సర్ కొడుతుంది’ అని చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma). ఒకప్పుడు ఆర్జీవీ తనకు నచ్చిన సినిమాల గురించి పెద్దగా మాట్లాడేవారు కాదు. కానీ గత కొంతకాలంగా ఆయన ఏ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ నచ్చినా కూడా ఓపెన్‌గా సోషల్ మీడియాలోనే షేర్ చేస్తున్నారు. అలా ఈమధ్య కాలంలో ఆర్జీవీకి ‘పెద్ది’ గ్లింప్స్ బాగా నచ్చిందని అర్థమవుతోంది.

Also Read: ఇంకా సమయం పడుతుంది.. ప్రభాస్ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేసిన డైరెక్టర్

అంచనాలు అందుకోలేదు

‘గేమ్ ఛేంజర్’ వల్ల రామ్ చరణ్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. శంకర్ లాంటి పాన్ ఇండియా దర్శకుడితో సినిమా అనగానే వారి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ సినిమా మాత్రం ఆ రేంజ్‌లో లేకపోవడంతో కేవలం యావరేజ్ హిట్‌గానే నిలిచింది. అందుకే తను బుచ్చి బాబుతో చేస్తున్న సినిమా అయినా బాగుండాలని ఫ్యాన్స్ ఆశించారు. వారందరి అంచనాలను మించేలా ‘పెద్ది’ (Peddi)ని రెడీ చేశాడు బుచ్చి బాబు. ఈ సినిమాలో మొదటిసారి రామ్ చరణ్ ఒక క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడు. అంతే కాకుండా ఈ క్యారెక్టర్‌ను తనను చూస్తుంటే ‘రంగస్థలం’లో చిట్టిబాబు గుర్తొస్తున్నాడని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×