BigTV English

Neha Shetty: రాధిక ఎక్కడ..? కంగారులో ఫ్యాన్స్..!

Neha Shetty: రాధిక ఎక్కడ..? కంగారులో ఫ్యాన్స్..!

Neha Shetty: నేహా శెట్టి(Neha Shetty).. ఈ పేరు చెబితే వెంటనే గుర్తుపట్టరు కానీ ‘డీజే టిల్లు’ రాధిక అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఆ పాత్రతో అంతలా పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు టిల్లు సినిమాలో గ్లామర్ తో ఆకట్టుకుంటూనే.. మరొకవైపు హీరోని మోసం చేసే పాత్రలో ఇందులో చాలా అద్భుతంగా నటించి, అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈమె నటన సినిమాకి బాగా క్లిక్ అయింది అని చెప్పాలి. అంతేకాదు రాధిక అంటే బ్యాడ్ గర్ల్ అనే ఇమేజ్ సెట్ అయిపోయే స్థాయికి చేరింది. పైగా ఇప్పుడు ఆ పేరు పెట్టాలంటేనే తల్లిదండ్రులు కూడా భయపడే అంత గట్టి ముద్ర వేసేసింది నేహా శెట్టి. ఇక ఈ సినిమా తర్వాత ఈమె క్రేజ్ కూడా భారీగా పెరిగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఈమె కెరీర్ కు కనీసం ఒక మెట్టు లాగా కూడా ఉపయోగపడలేకపోయాయి.


డీజే టిల్లు సినిమాతో చెరగని ముద్ర వేసిన నేహా శెట్టి..

ముఖ్యంగా బెదురులంక, రూల్స్ రంజన్ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. వాస్తవానికి ఈమె ‘మెహబూబా’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన గల్లీ బాయ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాలలో నటించింది. కానీ ఇందులో డీజే.టిల్లు మాత్రమే ఈమె కెరియర్ కు ప్లస్ అయ్యింది.మిగతా ఏ చిత్రం కూడా పెద్దగా విజయాన్ని అందించలేదు. చివరిగా గ్యాంగ్స్ సాఫ్ గోదావరి సినిమాలో నటించిన ఈమె ఈ సినిమా విడుదలై ఏడాది కావస్తున్న ఇప్పటివరకు మరో కొత్త సినిమా అప్డేట్ లేదు. అటు సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించడం లేదు. దీంతో అభిమానులలో ఆందోళన వ్యక్తం అవుతోంది.


Pawan Kalyan : అగ్ని ప్రమాదంలో పవన్ కొడుకు… అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?

రాధిక ఎక్కడ..?

గ్లామర్ తో యువతకు చెమటలు పట్టించిన రాధిక.. ఇప్పుడు ఎక్కడుంది? ఏమైపోయింది? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. దీనికి తోడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ఓజీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకుందని కొంతమంది వార్తలు గుప్పిస్తుంటే.. మరి కొంతమంది కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది అంటూ కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏది నిజమో తెలియదు కానీ రాధిక ఎంట్రీ కోసం మాత్రం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రాధిక మళ్లీ ఎప్పుడు తెరపై కనిపిస్తుందో చూడాలి. ఇక రాధిక విషయానికి వస్తే.. నేహా శెట్టి సింగ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. తన అందంతో నటనతో గట్టి పర్ఫామెన్స్ ఇచ్చి, ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది. అంటారు కదా ఇండస్ట్రీలో ఎంత కష్టపడినా ఆవగింజంత అదృష్టమైనా ఉండాలని.. బహుశా నేహా శెట్టికి ఆ అదృష్టం లేదేమో.. అందుకే వరుస చిత్రాలలో అవకాశాలు వచ్చినా సక్సెస్ కాలేక పోయింది. దీంతో ఆ అవకాశాలు కూడా తలుపు తట్టడం ఆగిపోయాయి అని అభిమానులు నిట్టూరుస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈమె టాలెంట్ ను గుర్తించి కనీసం యంగ్ డైరెక్టర్లు అయినా ఈమెకు అవకాశం ఇస్తారేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×