BigTV English

Mrunal Thakur: పెళ్లికి ముందే పిల్లల కోసం నటి మృణాల్ ప్లాన్.. ఆ నటిని ఫాలో అవుతానంటుందిగా.. !

Mrunal Thakur: పెళ్లికి ముందే పిల్లల కోసం నటి మృణాల్ ప్లాన్.. ఆ నటిని ఫాలో అవుతానంటుందిగా.. !

Mrunal Thakur recent news(Latest news in tollywood): అద్భుతమైన నటన, అంతకు మించిన అందం నటి మృణాల్ ఠాకూర్ సొంతం. ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది. ‘సీతారామం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎనలేని ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకుంది.


ఈ మూవీలో కట్టు, బొట్టుతో సాంప్రదాయంగా కనిపించి కుర్రకారు మనస్సు దోచుకుంది. ఇందులో ఆమె అందానికి ఫిదా అయినవారెందరో. ఈ ఒక్క సినిమాతోనే మృణాల్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. దీంతో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక ఈ మూవీ తర్వాత ‘హాయ్ నాన్న’ సినిమాలోనూ నటించి అదరగొట్టేసింది.

ఈ మూవీతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇటీవలే విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో నటించింది. ఈ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించుకుంది. ఇక వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న నటి మృణాల్ తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది. అందులో తన పర్సనల్, ప్రొఫెసనల్ లైఫ్‌కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.


Also Read: హీరామండీ ప్రీమియర్.. అలియా ధరించిన డ్రెస్ రేటు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..?

ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కెరీర్, లైఫ్‌ రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఈ రెండింటిని ఎలా టాలీ చేయాలని చూస్తుంటారు అని తెలిపింది. అయితే రిలేషన్‌షిప్స్ చాలా కఠినంగా ఉంటాయని.. అందువల్ల మనల్ని అర్థం చేసుకునే వారు దొరకడం చాలా కష్టంగా ఉంటుందని తెలిపింది.

ఆపై అండాలను నిల్వ చేయడంపై మృణాల్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. నటి మోనా సింగ్ మాదిరిగానే తాను కూడా అండాలను నిల్వ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పి అందరికీ షాకిచ్చింది. తాను కూడా ఎగ్స్ ఫ్రీజింగ్‌ గురించి ఆలోచిస్తున్నానని తెలిపింది. అయితే దీని తర్వాత నటీ నటులకు థెరపీ చాలా ముఖ్యమని చెప్పింది. అందువల్లనే తాను అప్పుడప్పుడు థెరపీలకు వెళ్తుంటానని తెలిపింది.

ఎందుకంటే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా దారుణంగా ఉంటానని పేర్కొంది. ఆ సమయంలో వర్క్ ప్రభావం తనపై ఉంటుందని.. అందువల్లనే థెరపీలకు వెళ్తుంటానని పేర్కొంది. దీంతో మృణాల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×