BigTV English

Pooja Hegde: రియలైజ్ అయిన బుట్ట బొమ్మ.. ఇకనైనా సరిదిద్దుకుంటుందా..?

Pooja Hegde: రియలైజ్ అయిన బుట్ట బొమ్మ.. ఇకనైనా సరిదిద్దుకుంటుందా..?

Pooja Hegde: పూజా హెగ్డే (Pooja Hegde).. మోడల్ గా కెరియర్ ఆరంభించిన ఆమె ఆ తర్వాత 2010లో మిస్ వరల్డ్ పోటీలకు ఇండియా నుండి ఎంపిక అయి రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 2012లో తమిళ చిత్రం ‘ముగమూడి’ అనే సినిమా ద్వారా అరంగేట్రం చేసి 2014లో వచ్చిన ‘ఒక లైలా కోసం’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటించారు. మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న ఈమె ఆ తర్వాత అదే ఏడాది ‘ముకుంద’ సినిమాలో నటించి తన అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.


హీరోయిన్ గానే కాదు.. ఐటమ్ గర్ల్ గా కూడా..

తెలుగు, తమిళ్ ప్రేక్షకులను మెప్పించిన పూజా హెగ్డే 2016లో ‘మొహంజదారో’ అనే సినిమాతో హిందీ అరంగేట్రం కూడా చేసింది. హీరోయిన్ గా కెరియర్ కొనసాగిస్తున్న సమయంలోనే రామ్ చరణ్ (Ram Charan), సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి అందరినీ మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత ‘దువ్వాడ జగన్నాథం’, ‘ గద్దల కొండ గణేష్’, ‘ అలవైకుంటపురంలో’, ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి చిత్రాలు ఈమెకు మంచి విజయాన్ని అందించాయి. ఆ తర్వాత కాలంలో ఏమైందో తెలియదు కానీ కథల ఎంపిక విషయంలో పూర్తిగా బొక్క బోర్ల పడింది ఈ ముద్దుగుమ్మ. ఇక అలా ఈమె నటించిన ‘బీస్ట్ ‘, ‘ఆచార్య’, ‘ రాధేశ్యామ్ ‘ ఇలా ఒక చిత్రం తర్వాత మరొకటి భారీ డిజాస్టర్ లను మూటగట్టుకున్నాయి. అయినా సరే ఈమె క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.


తప్పు సరిదిద్దుకుంటున్న పూజా హెగ్డే..

నిజానికి వరుస అవకాశాలు వస్తున్నా.. సరైన సక్సెస్ లేక సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే గత సినిమాల విషయంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా, తప్పు సరిదిద్దుకొని సెకండ్ ఇన్నింగ్స్ ను వచ్చే ఏడాది నుంచి గట్టిగా ప్లాన్ చేస్తోంది పూజా హెగ్డే. కొత్త ఏడాదికి కొత్త ప్లాన్ తో సిద్ధం అవుతుంది పూజా హెగ్డే. గత చిత్రాలతో కెరియర్ లో గాడి తప్పిన ఈమె చాలా అవకాశాలు చేజార్చుకుంది. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ ఫామ్ లోకి వస్తున్న ఈమె మళ్లీ కెరియర్ మీద ఫోకస్ పెట్టింది.

వరుస ఆఫర్లతో మళ్ళీ బిజీ..

ఈ క్రమంలోనే ‘సూర్య 44’, ‘విజయ్ దళపతి 69’ సినిమాలలో అవకాశం అందుకుంది. అంతేకాదు బాలీవుడ్లో తెరకెక్కుతున్న వరుణ్ ధావన్ చిత్రంలో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పూజా హెగ్డే. ప్రస్తుతం ఆఫర్లు మళ్ళీ వస్తున్న నేపథ్యంలో కెరియర్ పై ఫోకస్ పెట్టి కొత్త స్ట్రాటజీ సిద్ధం చేస్తోంది. గతంలో తాను చేసిన తప్పులను ఎనలైజ్ చేసుకుని.. ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో ఆ తప్పులు జరగకుండా చూసుకుంటానని కూడా చెబుతోంది. మరి కొత్త ఏడాది తన కెరియర్లో కొత్త టర్న్ తీసుకోబోతున్న బుట్టబొమ్మ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×