E-Paper
Advertisement

Pranitha Subhash: డిజైనర్ స్టూడియో ప్రారంభించిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఎక్కడంటే..?

Pranitha Subhash: డిజైనర్ స్టూడియో ప్రారంభించిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఎక్కడంటే..?
Advertisement

Pranitha Subhash.. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది ప్రణీత సుభాష్ (Pranitha subhash). ఆ తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది. అడపా దడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె ఇప్పుడు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఇంటికే పరిమితమైంది. ఇలాంటి సమయంలో తాజాగా డిజైనర్ స్టూడియో ప్రారంభానికి ముఖ్యఅతిథిగా విచ్చేసింది..

డిజైనర్ స్టూడియో ఆవిష్కరించిన ప్రణీత..

Advertisement

స్వయం డిజైనర్ స్టూడియో పేరుతో హైదరాబాద్ లో సరికొత్త డిజైనర్ స్టూడియో అందుబాటులోకి రాగా.. యమునా బధిత ఏర్పాటుచేసిన ఈ ఫ్లాగ్ షిప్ స్టోర్ ని ప్రముఖ సినీనటి ప్రణీత సుభాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఒకప్పుడు హైదరాబాదులో డిజైనర్లు, డిజైనర్ దుస్తులు అందుబాటులో ఉండేవి కాదు. అయితే ఇప్పుడు ప్రపంచ వేదికపై హైదరాబాద్ డిజైనర్ లో తమ ఖ్యాతిని చాటుతున్నారు. సాంప్రదాయ దుస్తులకు ఆధునికతను మేళవిస్తూ.. అద్భుతంగా సృష్టిస్తున్నారు. శుభకార్యాలు, ఇతర వేడుకలు ఏవైనా సరే ఇప్పుడు డిజైనర్ దుస్తులు చాలా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. నేను కూడా డిజైనర్ దుస్తులను అవసరానికి అనుగుణంగా ధరిస్తున్నాను” అంటూ తెలిపారు ప్రణీత సుభాష్.

నిర్వాహకురాలు యమునా బధిత..

Advertisement

నిర్వాహకురాలు యమునా బధిత మాట్లాడుతూ.. “నేను లండన్ లో మాస్టర్స్ పూర్తి చేశాను. డిజైనర్ రంగంపై నాకున్న అభిలాషతో ఈ స్టోర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అందించే డిజైన్లు సౌకర్యవంతంగా, అందాన్ని ఇనుమడింప చేసేలా ఉంటాయి. స్వయం అంటే సంస్కృతంలో స్వంతం అని అర్థం. మనం ధరించిన వాటిని ఇష్టపడడమే కాదు ప్రేమించడం కోసమే ఈ పేరును ఎంపిక చేసుకున్నాము. గతంలో ఆన్లైన్లో మా సేవలు చాలామంది ఉపయోగించుకున్నారు. ఇప్పుడు నగరవాసులకు కూడా ఈ స్టోర్ ద్వారా అందుబాటులోకి తీసుకు వచ్చాము. ఖాజాగూడా లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ అందరికీ ప్రత్యేకంగా నిలుస్తుందని భావిస్తున్నాము” అంటూ ఆమె తెలిపారు.

స్వయం డిజైనర్ స్టూడియో..

ఇకపోతే స్వయం డిజైనర్ స్టూడియో.. చక్కదనం, సౌకర్యాలపై దృష్టి సారించి హైదరాబాదులో తమ మొదటి స్టోర్ తో ఫ్యాషన్ పరిశ్రమలో గణనీయమైన ప్రభావాన్ని చూపడానికి సిద్ధంగా ఉన్నామని నిర్వాహకురాలు తెలిపింది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×