Pranitha Subhash: టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఏం పిల్లో.. ఏం పిల్లడో అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రణీత సుభాష్. చక్రాల్లాంటి కళ్లు, పాల మీగడ లాంటి దేహంతో మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారుకు ఫేవరేట్ గా మారింది.
ఇక ఈ సినిమా తరువాత బావ అనే సినిమాలో సిద్దార్థ్ సరసన నటించి మెప్పించింది. ఇక అమ్మడిని స్టార్ గా మార్చింది మాత్రం అత్తారింటికి దారేది సినిమా. పవన్ సరసన ఆమె నటించి మెప్పించింది. అమ్మో.. బాపుగారి బొమ్మ అంటూ పవన్ చేతనే పాడించిన అందం ప్రణీతది.
ఇక ఈ సినిమా తరువాత స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించిన ప్రణీత .. కెరీర్ పీక్స్ లో ఉండగానే నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను పెళ్ళాడి .. సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక 2022 లో ప్రణీత – నితిన్ కు అర్నా అనే కూతురు పుట్టింది. ఇక మరో రెండేళ్ల తరువాత ప్రణీత తన సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది.
పెళ్లి తరువాత కూడా అందాల ఆరబోత చేస్తూ.. అభిమానులకు దగ్గరగా ఉంటున్న ఈ చిన్నది.. నేడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది. తమ్ముడిని చూసి అక్క అర్నా గంతులు వేస్తుందని ఒక వీడియో షేర్ చేసింది. మొదటి డెలివరీకి ఉన్నంత కంగారు.. రెండవ డెలివరీకి లేదని, తామిద్దరం బాగానే ఉన్నామని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీంతో ప్రణీతకు అభిమానులు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.