BigTV English

Face Pack For Skin: ఈ ఫేస్ ప్యాక్‌తో క్లియర్ స్కిన్ !

Face Pack For Skin: ఈ ఫేస్ ప్యాక్‌తో క్లియర్ స్కిన్ !

Face Pack For Skin: అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అందంగా ఆకర్షణీయంగా కనిపించడం కోసం రకరకాల ఫేస్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వాటి వల్ల కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఇలాంటి రసాయనాలు ఉన్న ఫేస్ క్రీములు వాడకుండా ఇంట్లో ఉండే పదార్థాలతో ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. వీటికి అయ్యే ఖర్చు కూడా తక్కవే. ముఖ్యంగా ఇంట్లో తయారు చేసుకుని వాడే ఫేస్ ప్యాక్‌ల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.


అంతే కాకుండా ఫేస్ న్యాచురల్‌గా మెరుస్తూ కనిపిస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ ఫేస్ ప్యాక్‌లు చర్మాన్ని మృదువుగా మార్చడమే కాకుండా ముఖ కాంతిని పెంచుతాయి. మరి ఈ ఫేస్ ఫ్యాక్‌లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్..


కావలసినవి:
పెరుగు- 2 టేబుల్ స్పూన్లు
పసుపు- 1/4 టేబుల్ స్పూన్

తయారు చేసే విధానం:
ముందుగా ఇక బౌల్ తీసుకుని అందులో పెరుగు, పసుపు వేసి కలిపి పేస్ట్‌లా చేయాలి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. దీనిలో వాడిన పెరుగు చర్మాన్ని తేమను అందిస్తుంది. అంతే కాకుండా దీనిలోని పసుపులో యాంటీసెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మచ్చలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ముఖానికి రెట్టింపు అందాన్ని ఇస్తుంది.

2. ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్..

కావలసినవి:
ముల్తానీ మిట్టి-2 టీస్పూన్లు
రోజ్ వాటర్-1 టీస్పూన్

తయారుచేసే విధానం:
పైన తీసుకున్న కొలతల ప్రకారం, ముల్తానీ మిట్టిని రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్‌ మిశ్రమంలాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగేయాలి. దీని వల్ల ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా వీటిలోని ముల్తానీ మిట్టి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి శుభ్రపరుస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

3. ఓట్స్, తేనె ఫేస్ ప్యాక్..

కావలసినవి:
ఓట్స్- 2 టీస్పూన్లు
తేనె-1 టీస్పూన్
పాలు-కొద్దిగా

తయారుచేసే విధానం:
ముందుగా ఓట్స్‌ను గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. అందులో తేనె, పాలు కలిపి పేస్ట్‌లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. దీనిలోని ఓట్స్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. అంతే కాకుండా తేనె చర్మానికి తేమను అందిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా మెరిసేలా తయారు చేస్తుంది.

Also Read: అందమైన ముఖం కోసం.. ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

4. అరటి , తేనె ఫేస్ ప్యాక్..

కావలసినవి
అరటిపండు- 1
తేనె-1 టీస్పూన్

తయారుచేసే విధానం:
అరటిపండును మెత్తగా చేసి అందులో తేనెను కలపాలి. దీనిని ముఖానికి అప్లై చేసిన తర్వాత 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. అరటిపండు చర్మానికి పోషణనిస్తుంది అంతే కాకుండా తేనె చర్మానికి తేమనిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×