BigTV English

Sreeleela break from movies | సినిమాలకు శ్రీలీల బ్రేక్, ఎందుకో తెలుసా?

Sreeleela break from movies | సినిమాలకు శ్రీలీల బ్రేక్, ఎందుకో తెలుసా?

Actress Srileela break from movies


Actress Sreeleela break from movies:టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ప్రస్తుతం శ్రీలీల ట్రెండ్ నడుస్తోంది. ఎందుకంటే చిన్న వయసులోనే చిచ్చరపిడుగులా తన యాక్టింగ్‌తో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ హౌరా అనిపిస్తోంది. అంతేకాదు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. చేసింది కొన్ని మూవీస్‌ అయినా సరే అతి తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది ఈ ముద్దుగుమ్మా. తన టాలెంట్‌తో ఆఫర్లు తన ఇంటి ముంగిట క్యూ కడుతుండటంతో మూడు పువ్వులు, ఆరుకాయలులాగా నడుస్తోంది తన కెరీర్. ప్రస్తుతం శ్రీలీల గ్యాప్‌ లేకుండా నాన్‌స్టాప్‌గా షూటింగ్స్‌తో బిజీ అయిపోయింది. ఇక శ్రీలీల మూవీస్‌కి కొద్ది రోజులు దూరం కానుందన్న వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ముద్దుగుమ్మా..టాలీవుడ్‌ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో చేసిన పెళ్లి సందడి మూవీలో నటించి మంచి మార్కులను కొట్టేసింది. అనంతరం వరుసగా.. ధమాఖా మూవీతో పాటుగా బాలయ్య భగవంత్ కేసరి మూవీలోనూ యాక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌లను తన ఖాతాలో వేసుకుంది. ఆదికేశవ నిరాశ పరిచిన గుంటూరు కారం మూవీ హిట్‌ కావడంతో మళ్లీ ఫాంలోకి వచ్చింది.


Read More: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పుడు ఐఏఎస్, సక్సెస్ జర్నీ

శ్రీలీల అతి తక్కువ సమయంలో తన అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ అతి తక్కువ టైం పీరియడ్‌లో అగ్ర హీరోలైన బాలయ్య, మహేశ్‌బాబు, పవన్‌కల్యాణ్, రామ్‌ పోతినేనిలతో నటించే ఛాన్స్ కొట్టేయడం మరో విశేషం. ఈ మధ్యకాలంలో అతి తక్కువ టైంలో ఇంతమందితో కలిసి నటించడం బహుశా ఈ ముద్దుగుమ్మనే అని చెప్పొచ్చు.

ఇప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీని తన యాక్టింగ్‌, డ్యాన్స్‌లతో శ్రీలీల ఊపుతుంటే. మున్ముందు ఏ స్థాయిలో ఊపుతుందనే సందేహాలు టాలీవుడ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు చేతినిండా సినిమాలతో పుల్ బిజీగా ఉన్న శ్రీలీల, మరోవైపు సోషల్‌మీడియాలను ఎంతో ఆక్టీవ్‌గా ఉంటూ మాంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది.

Read More: రాడిసన్ డ్రగ్స్ కేసు.. దర్శకుడు క్రిష్‌కి బిగ్ రిలీఫ్

ఇక ఇదిలా ఉంటే.. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ శ్రీలీల తన మూవీస్‌కి బ్రేక్‌ ఇవ్వనున్నట్లు నెట్టింట వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె ఓ వైపు.. ఎంబీబీఎస్ చదువుతూనే, మరోవైపు మూవీస్‌తో బిజీ అయిపోయింది ఈ భామ. ఇంకో స్పెషల్‌ ఏంటంటే.. ఆమె తల్లి కూడా డాక్టర్ కావడం మరో విశేషం. అయితే తన ఎంబీబీఎస్ పరీక్షల కోసం బ్రేక్ తీసుకున్నప్పటికి ఆమె ఇప్పటివరకు కొత్త మూవీకి సైన్ చేయకపోవడంతో ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశంపై ఈ అమ్మడు స్పందించేంతవరకు మనం కూడా వెయిట్ చేయకతప్పదు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×