Varalakshmi Sarath Kumar:ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి దొరికిన మరో రమ్యకృష్ణ (Ramyakrishna) గా పేరు దక్కించుకుంది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె ఎలాంటి పాత్రలోనైనా సరే నటించగల సత్తా ఈమె సొంతం. అలాంటి ఈమె తాజాగా తన రూమర్డ్ మాజీ ప్రియుడు విశాల్ (Vishal) హెల్త్ గురించి వస్తున్న వార్తలపై స్పందించి, అందరిని ఆశ్చర్యపరిచింది. మరి వరలక్ష్మి శరత్ కుమార్ .. విశాల్ ఆరోగ్యం గురించి ఎలాంటి కామెంట్లు చేసిందో ఇప్పుడు చూద్దాం.
వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న హీరో విశాల్..
కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ (Vishal) గత కొద్దిరోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈయన నటించిన మదగజరాజ (Madagajaraja) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా కనిపించి, అందరిని ఆశ్చర్యపరిచారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఇబ్బంది పడుతున్న విశాల్ ని చూసి చాలామంది పలు రకాల కామెంట్లు వైరల్ చేయడంతో ఇప్పటికే హీరో జయం రవి (Jayam Ravi), హీరోయిన్ ఖుష్బూ (Khushboo) తదితరులు ఈ హీరో ఆరోగ్యం పై స్పందించి, క్లారిటీ ఇచ్చారు. అయినా సరే సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి.” విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని, తీవ్రమైన బాడీ పెయిన్స్ ఆయనను ఇబ్బంది పెడుతున్నాయని, రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పినా, లెక్క చేయకుండా సినిమా ప్రమోషన్స్ కి హాజరవుతున్నారని” విశాల్ మేనేజర్ కూడా పెట్టిన ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విశాల్ ఆరోగ్యం పై స్పందించిన వరలక్ష్మి శరత్ కుమార్..
ఇకపోతే మదగజరాజా సినిమా ప్రచారంలో భాగంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది. తన మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడిన ఈమె.. తన భర్త నికోలయ్ సచ్ దేవ్ (Nikolai Such Dev) చాలా మంచి వ్యక్తి అని, అలాంటి హస్బెండ్ రావడం తన అదృష్టం అని ఆమె తెలిపింది. ఫ్యామిలీ లైఫ్ కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు .. నాకంటే తనే మా ఫ్యామిలీ మెంబర్స్ తో ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారని కూడా ఆమె తెలిపింది. అమ్మ వాళ్లు కూడా నికోలయ్ తో అన్ని విషయాలు పంచుకుంటారు అని కూడా తెలిపింది వరలక్ష్మి శరత్ కుమార్. అలాగే విశాల్ ఆరోగ్యం పై ప్రశ్న ఎదురవగా..”ఆయన హెల్త్ తొందరగా రికవరీ అవ్వాలని కోరుకుంటున్నాను, అభిమానుల ఆశీస్సులు ఎప్పుడూ ఆయనపై ఉంటాయని భావిస్తున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది.
డైరెక్టర్ సుందర్ పై వరలక్ష్మి కామెంట్స్..
ఇక డైరెక్టర్ సుందర్ గురించి మాట్లాడుతూ..”షూటింగ్ సమయంలో ఆయన బాగా సపోర్ట్ చేశారు. ఎంతో సరదాగా గడిచిపోయింది. ముఖ్యంగా ఎన్నో విషయాలు దర్శకుడు దగ్గర నుంచి నేర్చుకున్నాను. విశాల్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు.ఈ మూవీలో ఆయన 8 ప్యాక్ బాడీతో కనిపించనున్నారు ఈ సినిమా కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్” అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో ప్రముఖ నటి అంజలి (Anjali) కూడా హీరోయిన్ గా నటించినది. ఇక జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.