ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి శుభవార్త. గుజరాత్ రాష్ట్రానికి చెందిన అనుమలలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL), కక్రాపర గుజరాత్ సైట్‌లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 284
ఇందులో పలు విభాగాల్లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ట్రేడ్ అప్రెంటిస్‌లు–176, డిప్లొమా అప్రెంటిస్‌లు–32, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–76 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
శిక్షణా కాలం: ఏడాది సమయం ఉంటుంది.
ట్రేడ్ అప్రెంటీస్:
ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, సీవోపీఏ/పీఏఎస్‌ఏఏ, మెషినిస్ట్, టర్నర్, ఏసీ మెకానిక్, డీజిల్ మెకానిక్ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
డిప్లొమా అప్రెంటీస్:
కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్:
కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, బీఎస్సీ(ఫిజిక్స్), బీఎస్సీ(కెమిస్ట్రీ), హ్యూమన్ రిసోర్సెస్, కాంట్రాక్ట్స్ అండ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
వయస్సు: 2025 జనవరి 21 నాటికి ట్రేడ్ అప్రెంటీస్‌కు 18 నుంచి 24 ఏళ్లు, డిప్లొమా అప్రెంటీస్ 18 నుంచి 25 ఏళ్ల వయస్సు, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగానికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్సు ఉంటే సరిపోతుంది.
స్టైఫండ్: అప్రెంటీస్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి స్టైఫండ్ ఉంటుంది. ట్రేడ్ అప్రెంటీస్‌కు రూ.7,700 నుంచి రూ.8,050, డిప్లొమా అప్రెంటీస్‌కు రూ.8,000, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు రూ.9,000 ఇస్తారు.
ఉద్యోగ ఎంపిక విధానం: ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ కోర్సులో పొందిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తారు.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 21
Also Read: Central Bank Jobs: ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.. హాజరైతే చాలు.. రేపే లాస్ట్ డేట్..!
అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. వెంటనే ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.