BigTV English

Actress Vijayashanthi:హీరోలంతా దొంగలే అంటూ షాకిచ్చిన సీనియర్ నటి

Actress Vijayashanthi:హీరోలంతా దొంగలే అంటూ షాకిచ్చిన సీనియర్ నటి

Actress Vijayashanti Sensational Comments On Tollywood Heroes: టాలీవుడ్‌లో ఎంతమంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చినా, ఆ హీరోయిన్‌ రోల్‌కి మాత్రం స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చిన ఘనత ఒక్క విజయశాంతికే దక్కుతుందని చెప్పాలి. ఎందుకంటే ఆమె లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేయడం, స్టార్‌ హీరోలతో సినిమాలు చేసి మెప్పించడం నిజంగా గ్రేట్‌ అనే చెప్పాలి. మరోవైపు తాను మెయిన్‌ లీడ్‌గా చేసిన సినిమాలు స్టార్‌ హీరోల మూవీస్‌కు సైతం తీసిపోని రేంజ్‌లో వాటన్నింటికి ధీటుగా రిలీజ్ కావడమే ఇందుకు ప్రధాన కారణం. అంతేకాదు వాటితో పాటుగా థియేటర్ల వద్ధ కలెక్షన్ల వర్షం కురిపించాయి.ఇక లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు చిరునామాగా మారింది విజయశాంతి. పలు సినిమాల్లో తన హీరోయిజాన్ని చూపించిన ఘనత ఒక్క విజయశాంతికే దక్కుతుంది. పవర్‌ఫుల్‌ పోలీస్‌ రోల్స్ చేస్తూ ఆమె సినిమాల్లో చేసిన రచ్చ మామూలుగా ఉండేది కాదు. కమర్షియల్‌ హీరోయిన్‌ నుంచి లేడీ ఇంపార్టెంట్‌ కలిగిన మూవీస్ చేసి అందరి చేత హౌరా అనిపించుకుంది.


ఇందులో మెయిన్‌గా కర్తవ్యం, ఒసేయ్‌ రాములమ్మ వంటి సంచలన మూవీస్‌ ఆడియెన్స్‌ ఇప్పటికి మర్చిపోలేరు. విజయశాంతి తన కెరీర్‌లో బిజీగా ఉన్న టైంలోనే ఆమె పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన మార్క్‌ని చూపించింది. కానీ ఇప్పుడామె రాజకీయంగా కూడా తన మనుగడను క్రమక్రమంగా కోల్పోతుంది. యాక్టివ్‌ పాలిటిక్స్‌లో లేకపోవడంతో నేటి రాజకీయాల్లో సర్వైవ్‌ కావడం ఆమెకి కష్టతరంగా మారింది. ఎలక్షన్స్‌ టైమ్‌లో హడావుడి చేసిన ఆమె మళ్లీ పాలిటిక్స్ తెరపై కనిపించడం లేదు. కానీ ఆమె గతంలో చేసిన ఓ పాత యూట్యూబ్‌ ఇంటర్వ్యూ వీడియో మాత్రం తాజాగా నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇందులో స్టార్‌ హీరోలపై ఆమె చేసిన కామెంట్లు నెట్టింట తీవ్ర దుమారం రేపుతూ సోషల్‌మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి.

Also Read: మీర్జాపూర్ 4 మూవీపై నటి అదిరిపోయే అప్డేట్


ఇందులో మెయిన్‌గా మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, ప్రజా సమస్యలపై ఆయన పోరాటం చేయడానికి సంబంధించిన విజయశాంతి అప్పట్లో తీవ్ర విమర్శలు చేసింది. దానిపై యాంకర్‌ ప్రశ్నించగా, ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు, ప్రజల తరఫున పోరాడలేనప్పుడు కచ్చితంగా వేలెత్తి చూపిస్తాం. ఆ స్థానంలో ఎవరున్నా సరే తాను రియాక్ట్ అవుతానని, వేలెత్తి చూపిస్తానని విజయశాంతి తెలిపింది. ఈ సందర్భంగా టాలీవుడ్‌ ఇండస్ట్రీ గురించి ఆమె షాకింగ్‌ కామెంట్ చేసింది.
ఈ ఇంటర్వ్యూ తెలంగాణ రాకముందు చేసింది కావచ్చు. అందుకే ఇందులో మెయిన్‌గా తెలంగాణ ప్రస్తావన వచ్చింది. తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సినీ తారలు కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని, తెలంగాణ ప్రజలు ఆదరించం వల్లే ఇంత పెద్ద హీరోలయ్యారంటూ ఆమె కామెంట్స్ చేసింది. వాళ్లు ఇచ్చే డబ్బులతోనే ఇంతటి రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారని ఫైర్ అయింది. ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారని అడిగితే ఎవరూ ముందుకు రాలేదని, ఎవరూ రియాక్ట్ కాలేదని వాపోయింది.
వాళ్లు కేవలం స్వార్థంతోనే రియాక్ట్ కాలేదని విజయశాంతి చెప్పింది. హీరోలకు గట్స్ లేవని అనుకుంటున్నానని, కేవలం సినిమాల్లోనే రీల్‌ హీరోలు కాకుండా, బయట కూడా రియల్‌ హీరోలుగానే ఉండాలని, సినిమాల్లో సమాజానికి సేవ చేశానని చెప్పడం, కాదు బయటకు కూడా చేయాలన్నది. కనీసం ఇరవై శాతం అయినా కూడా వర్క్‌ చేయడం లేదని, అంతా ముసుగు దొంగలంటూ విజయశాంతి హాట్‌ కామెంట్‌ చేసింది.

ఈ క్రమంలో చిరంజీవిపై సెటైర్లు పేల్చింది. పార్టీ పెట్టిన వెంటనే సీఎం అయిపోవాలంటే కుదురుతుందా. రామారావులా అందరు అయిపోవాలంటే సాధ్యమవుతుందా?. రామారావుకి గట్స్ ఉన్నాయి కాబట్టి సీఎం అయ్యారు. ప్రజల కోసం పనిచేశారు. ఎంతో కష్టపడ్డారు. కానీ మీరు అన్ని సుఖాలకు అలవాటు పడి, ఓవర్‌నైట్‌లో సీఎం అయిపోవాలంటే ఎలా సాధ్యం. ప్రజల కోసం కష్టపడాలి, డెడికేషన్‌, కమిట్‌మెంట్ ఉండాలి.ఇక ఇదిలా ఉంటే హీరోయిన్ విజయశాంతి,మెగాస్టార్‌ చిరంజీవి కలిసి ఇరవైకి పైగా సినిమాల్లో నటించి భలే జోడీ జోడీగా పేరు తెచ్చుకున్నారు. విజయశాంతి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేశాక, చిరుతో చేయడం తగ్గించారు. కానీ ఈ ఇద్దరి కాంబోలో దాదాపు 20 సినిమాలు వచ్చాయి. ఇటీవల మహేశ్‌బాబు హీరోగా చేసిన సరిలేరు నీకెవ్వరు మూవీ ఈవెంట్‌లో ఈ ఇద్దరు మళ్లీ కలుసుకుని గత విమర్శలు సరదాగా మాట్లాడుకున్న విషయం మనందరికి తెలిసిందే. ఈ మూవీతో విజయశాంతి రీ-ఎంట్రీ ఇచ్చారు. మళ్లీ కొంత గ్యాప్‌తో ఇప్పుడు కళ్యాణ్‌ రామ్‌ హీరోగా యాక్ట్ చేసిన మూవీలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌ పోషిస్తున్నారు.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×