BigTV English

Y. Vijaya: ఆ హీరో ఎప్పుడెప్పుడు టచ్ చేస్తాడా అని ఎదురుచూశా..

Y. Vijaya: ఆ హీరో ఎప్పుడెప్పుడు టచ్ చేస్తాడా అని ఎదురుచూశా..

Y. Vijaya:  సీనియర్ నటి వై విజయ  గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా ఆమె ఎన్నో మంచి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. గడుసు అత్తగా.. లేడీ విలన్ గా వై విజయ నటించింది. ఇక ఇప్పటికీ ఆమె  స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ వస్తుంది. ఇంకోపక్క బుల్లితెరపై కూడా ఆమె తన ప్రస్థానాన్ని  సాగిస్తుంది.  అప్పుడప్పుడు ఈటీవీ షోస్ లలో కూడా కనిపిస్తూ కనువిందు చేస్తుంది.


ఈ మధ్యకాలంలో వై విజయకు చెప్పుకోదగ్గ పాత్ర అంటే ఎఫ్ 2 అని చెప్పాలి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ ల బామ్మగా ఆమె నటన ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం వచ్చిన  అవకాశాలను వదులుకోకుండా మంచి పాత్రల్లో నటిస్తుంది వై విజయ.

ఇక సినిమాల విషయం పక్కన పెడితే..  యూట్యూబ్ లో అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ.. అప్పటి సినిమా ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వై విజయ తన గతం తాలూకు  జ్ఞాపకాలను నెమరువేసుకుంది. తనతో కలిసి నటించిన హీరోల గురించి మాట్లాడింది.


శోభన్ బాబు గురించి మాట్లాడుతూ.. ” శోభన్ బాబుగారు చాలా జాలీ టైప్. బాగా జోక్స్ వేస్తారు. నేను ఫస్ట్ మూవీ చేసేటప్పుడు భయం, సిగ్గు ఉండేవి. ఎలా వచ్చావు ఇంత కలర్ అని అడిగేవారు. నాకేం తెలుసు.. మా అమ్మనాన్న మంచి కలర్ అండీ అని చెప్పాను. నీకు 18 ఏళ్లు ఉంటాయా అంటే.. లేదండీ 13 ఏళ్లు అంటే.. ఇప్పుడిప్పుడే ఫీల్డ్ కు వచ్చి అబద్దాలు చెప్తున్నావా అని అన్నారు. దానికి నాకు ఏడుపొచ్చింది. లేదు సార్.. నేను నిజమే చెప్తున్నాను అన్నాను. ఆ తరువాత ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా నేను ఆయనతో ఎన్ని సినిమాలు చేశాను” అని చెప్పుకొచ్చింది.

Aishwarya Rajesh : రెడ్ కలర్ లెహంగాలో ఐశ్వర్య..చూసే కనులదే ఆ ‘భాగ్యం’!

ఇక ఆమె తన కెరీర్ లో ఒక హీరోను చూసి చాలా ఆశ్చర్యపోయినట్లు తెలిపింది. ఆయన ఏరోజు హీరోయిన్ ను టచ్ చేసి యాక్ట్ చేయలేదని చెప్పుకొచ్చింది. ఆయనే బాలీవుడ్ స్టార్ హీరో మనోజ్ కుమార్. హిందీలో వై విజయ ఎన్నో చిత్రాల్లో నటించింది. ఇక మనోజ్ కుమార్ గురించి ఆమె మాట్లాడుతూ.. ” ఒక నటిగా నేను కూడా స్క్రీన్ మీద చూసేటప్పుడు ఎంతో  అబ్జర్వ్ చేశాను.

మనోజ్ కుమార్ సినిమాలు చూసేటప్పుడు.. ఆయన ఎప్పుడు హీరోయిన్ ను టచ్ చేయడు. ఏ సినిమా అయినా  చూడండి. నేనే కాదు ఎంతోమంది నటీనటులు.. మనోజ్ కుమార్ .. హీరోయిన్ ను టచ్ చేస్తాడా.. ? అని ఎదురుచూసేవాళ్లం. ఒక్కసారైనా టచ్ చేస్తే బావుండు అనుకునేదాన్ని. నేను చిన్నప్పుడే  ఒక వ్యక్తి గురించి మాటల్లోనే కనుక్కొనేదాన్ని. అతడు ఎలాంటివాడు.. ఓపెన్ గా మాట్లాడుతున్నాడా.. ? వేరే ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నాడా.. ? అని తెలుసుకున్నాకే మాట్లాడేదాన్ని” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×