BigTV English

Imran Khan: ఇమ్రాన్‌‌ఖాన్‌ అరెస్ట్.. హత్యకు కుట్ర? పాక్‌లో తీవ్ర ఉద్రిక్తత..

Imran Khan: ఇమ్రాన్‌‌ఖాన్‌ అరెస్ట్.. హత్యకు కుట్ర? పాక్‌లో తీవ్ర ఉద్రిక్తత..
imran khan arrest

Imran khan news pakistan today(International News Headlines): పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ ను పాక్ రేంజర్లు అరెస్టు చేశారు.


ఇమ్రాన్ ఖాన్ పై 85కు పైగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుల్లో విచారణ కోసం ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చిన ఇమ్రాన్‌ ఖాన్‌ ను పాక్ రేంజర్లు.. కోర్టు బయటే అదుపులోకి తీసుకున్నారు. అడ్డుకోబోయిన లాయర్లపై దాడి చేశారు. ఇమ్రాన్ ను బలవంతంగా అరెస్ట్ చేసి రహస్య ప్రాంతానికి తరలించారు. ఇమ్రాన్ అరెస్ట్ విషయం తెలిసి పాకిస్తాన్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి.

అయితే అరెస్టుకు సిద్ధంగా ఉన్నానంటూ ఉదయమే ఇమ్రాన్ ప్రకటించాడు. అరెస్ట్ కు ముందు ఇమ్రాన్ ఖాన్ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. తనపై తప్పుడు కేసులు మోపి అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు ఇమ్రాన్ ఖాన్. తన అరెస్ట్ వెనుక మిలటరీ హస్తం ఉందంటున్నారు ఇమ్రాన్. తనను హత్య చేయడానికి ఇప్పటికే చాలా సార్లు కుట్ర చేశారని.. అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు అరెస్ట్ పేరుతో డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ప్రజల్లో తనపై పెరుగుతున్న అభిమానమే ప్రభుత్వాన్ని భయపెడుతోందని.. అందుకే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి ప్రజలకు దూరం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు ఇమ్రాన్.


ఇమ్రాన్ అరెస్ట్ పై PTI లీడర్లు, అతని తరపు లాయర్లు మండిపడుతున్నారు. అరెస్ట్ సమయంలో అత్యంత అమానవీయంగా ప్రవర్తించారని మండిపడ్డారు. అతడిని అరెస్ట్ చేయలేదని.. ఎత్తుకెళ్లారన్నారు. ఇమ్రాన్ ను టార్చర్ చేశారని ఆరోపించారు. రేంజర్లు చేసిన దాడిలో ఇమ్రాన్ తరపు లాయర్లకు గాయాలయ్యాయి.

చాలా రోజులుగా ఇమ్రాన్ ను అరెస్ట్ చేయాలని పాక్ రేంజర్లు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఇమ్రాన్ నివాసంలో అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రేంజర్లు వెనక్కి తగ్గారు.

ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ పై ఇస్లామాబాద్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇస్లామాబాద్‌ పోలీస్ చీఫ్‌ తమ ముందు హాజరవ్వాలని ఆదేశించింది. తమ ఆదేశాలను పెడచెవిన పెడితే.. పాక్ ప్రధాని కూడా తమ ముందు హాజరవ్వాల్సి ఉంటుందని మండిపడింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×