BigTV English

Bollywood: 25 ఏళ్ల తర్వాత మళ్ళీ జోడీ.. ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతోందా..?

Bollywood: 25 ఏళ్ల తర్వాత మళ్ళీ జోడీ.. ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతోందా..?

Bollywood:బాలీవుడ్ నటి టబు (Tabu).. 50 ఏళ్ల వయసులో కూడా.. ఏజ్ తో సంబంధం లేకుండా ఇంకా సినీ ఇండస్ట్రీలో యాక్టివ్ గా కొనసాగుతోంది అంటే ఈమెని చాలామంది హీరోయిన్లు ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే 50 ఏళ్ల వయసు వచ్చినా కూడా కనీసం పాతికేళ్లు కూడా దాటని అమ్మాయిలా తన ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ.. కుర్ర బ్యూటీలకు తన అందం తోనే హడల్ పుట్టిస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ హీరోకి జోడి కట్టబోతుందట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు? 25 సంవత్సరాలుగా వీరి కాంబోలో మళ్ళీ రెండో సినిమా ఎందుకు రాలేదు? అనేది ఇప్పుడు చూద్దాం.. టబు బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ సౌత్ లో కూడా పేరున్న హీరోయిన్.. ఈమె 90’స్ అబ్బాయిలకి కలల రాకుమారి అని చెప్పుకోవచ్చు. అలా ఎంతో మంది 90’స్ అబ్బాయిలకు టబు క్రష్ గా ఉండేది.


25 ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్ తో జోడీ కట్టనున్న టబు..

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తెలుగులో నాగార్జున(Nagarjuna)తో నిన్నే పెళ్ళాడుతా, ఆవిడ మా ఆవిడే,సిసింద్రీ వంటి సినిమాలు చేసింది.అలాగే చిరంజీవి (Chiranjeevi)తో అందరివాడు, బాలకృష్ణ(Balakrishna)తో చెన్న కేశవరెడ్డి, పాండురంగడు, వెంకటేష్(Venkatesh)తో కూలి నెంబర్ వన్ వంటి సినిమాల్లో నటించింది. అలా కెరియర్ పరంగా ఎంతో సక్సెస్ చూసిన ఈమె వ్యక్తిగతంగా 50 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లయితే చేసుకోవడం లేదు. ఇక ఈమె పెళ్లి చేసుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అవి కాస్త పక్కనే పెడితే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 25 సంవత్సరాల తర్వాత ఆ హీరోకి జోడిగా ఓ సినిమా చేయబోతుందట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు .. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay kumar)..ప్రస్తుతం అక్షయ్ కుమార్, టబు కాంబినేషన్లో ‘భూత్ బంగ్లా’ అనే సినిమా వస్తోంది. ఈ విషయం తెలిసి అభిమానులు మళ్లీ ఏదైనా మ్యాజిక్ జరగాలని కోరుకుంటున్నారు. ఈ సినిమాకి ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా .. ఏక్తాకపూర్, శోభ కపూర్, అక్షయ్ కుమార్ లు సంయుక్తంగా అక్షయ్ కుమార్ ప్రొడక్షన్స్, బాలాజీ టెలి ఫిలింస్ పథాకంపై నిర్మిస్తున్నారు. హార్రర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న భూత్ బంగ్లా సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది.


అలాంటి కామెంట్స్ తో వార్తల్లో నిలిచిన టబు..

ఎందుకంటే ఈ సినిమాని ఈ ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేయాలని మూవీ మేకర్స్ ఆలోచించి, రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసి పెట్టుకున్నారట. అలా తక్కువ టైం ఉండడంతో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జైపూర్ లో జరుగుతుంది.ఇక టబు ఓవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ లు అంటూ తీరిక లేకుండా ఇండస్ట్రీలో పని చేస్తోంది. అలా దాదాపు 34 సంవత్సరాల నుండి ఈ హీరోయిన్ గ్యాప్ తీసుకోకుండా సినిమాల్లో రాణిస్తూనే ఉంది. టబు ప్రస్తుతం సౌత్లో ఎక్కువగా కనిపించడం లేదు.ఈమె చివరిగా అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్రలో నటించింది. అప్పటి నుండి మళ్లీ తెలుగులో నటించడం లేదు.పూర్తిగా హిందీలోనే నటిస్తోంది. ఇక రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో టబు తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. నాకు పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు.కానీ బెడ్ షేర్ చేసుకోవడానికి ఒక మగాడు అయితే కావాలి అంటూ ఊహించని కామెంట్లు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×