BigTV English

Dhamaka : మ‌ళ్లీ ‘ధమాకా’ కాంబో.. రంగంలోకి స్టార్ ప్రొడ్యూసర్

Dhamaka : మ‌ళ్లీ ‘ధమాకా’ కాంబో.. రంగంలోకి స్టార్ ప్రొడ్యూసర్

Dhamaka : గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ సాధించిన చిత్రం ‘ధమాకా’. మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన సినిమా. కమర్షియల్ ఫార్మేట్లో రూపొందిన ఈ మూవీ రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. అయితే లేటెస్ట్‌గా సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్ మేర‌కు మ‌రోసారి ‘ధమాకా’ కాంబినేష‌న్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌నుంది. దాని కోసం ఓ స్టార్ ప్రొడ్యూస‌ర్ అన్నీ స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌.. ఆయ‌నెవ‌రో కాదు దిల్ రాజు. క్రేజీ కాంబినేష‌న్స్‌లో సినిమాలు చేసి హిట్స్ సొంతం చేసుకోవ‌టంలో దిల్ రాజు ఎప్పుడూ ముందుంటారు. లో బ‌డ్జెట్ మూవీస్ చేయ‌ట‌మే కాదు.. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను కూడా భారీ బ‌డ్జెట్‌తో చేయ‌టానికి అస్స‌లు వెనుకాడ‌రు.


‘ధమాకా’ హిట్ త‌ర్వాత డైరెక్ట‌ర్ త్రినాథ‌రావుని పిలిచి త‌న బ్యాన‌ర్‌లో అలాంటి క‌మ‌ర్షియ‌ల్ మూవీ చేయాల‌ని చెప్పి మంచి మొత్తాన్ని అడ్వాన్సుగా ఇచ్చారు. దాని కోసం త్రినాథ‌రావు న‌క్కిన సైతం ఓ పాయింట్‌ను అనుకుని రీసంట్‌గా ర‌వితేజ‌ను క‌లిసి చెప్ప‌గా త‌న‌కు కూడా న‌చ్చింది. పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయ‌మ‌ని చెప్పిన‌ట్లు వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అంతా ఓకే అయితే వ‌చ్చే ఏడాదిలో ‘ధమాకా’ కాంబోలో అంటే ర‌వితేజ‌, త్రినాథ‌రావుల‌తో పాటు శ్రీలీల క‌ల‌యిక‌లో సినిమా ఉంటుంద‌ని న్యూస్‌.

ర‌వితేజ ఇప్పుడు వ‌రుస సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాను పూర్తి చేస్తూనే ఈగ‌ల్ సినిమా షూటింగ్‌లోనూ బిజి బిజీగా ఉన్నారాయ‌న‌. ఆ రెండు సినిమాల‌ను కంప్లీట్ చేసిన త‌ర్వాత గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌టానికి మాస్ రాజా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దాని త‌ర్వాతే ‘ధమాకా’ సినిమాను ట్రాక్ ఎక్కించే అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×