BigTV English

Agent Movie Review : ఏజెంట్.. వైల్డ్ సాలా ..హిట్టా? పట్టా..?

Agent Movie Review : ఏజెంట్.. వైల్డ్ సాలా ..హిట్టా? పట్టా..?


Agent Movie Review(Latest Tollywood News) : అఖిల్ అక్కినేని హీరోగా నటించిన తాజా చిత్రం ఏజెంట్. ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్. మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఏజెంట్ ను తెరకెక్కించాడు. థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా..? అంచనాలు అందుకుందా..? ఈ విషయాలు రివ్యూలో తెలుసుకుందాం.

సోర్టీ ఏంటంటే?…రిక్కీ అలియాస్ రామకృష్ణ అంటే అఖిల్ తాను పవర్ ఫుల్ ‘రా’ ఏజెంట్ కావాలని చిన్నప్పటి నుంచి కల కంటూ ఉంటాడు. అయితే అఖిల్ మూడుసార్లు రా ఏజెంట్ గా రిజెక్ట్ అవుతాడు. కానీ రా ఏజెన్సీ హెడ్ డెవిల్ మహాదేవ్ అంటే మమ్ముట్టిని ఆకట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో రిక్కీ, వైద్య అంటే సాక్షి వైద్యతో ప్రేమలో పడతాడు. అయితే అఖిల్ కు మమ్ముటి ఒక డేంజరస్ మిషన్ అప్పగిస్తాడు. ఇంతకీ ఏంటీ ఆ మిషన్ ? అసలు అఖిల్ ఎందుకు రా ఏజెంట్ కావాలనుకున్నాడు ? చివరకు అఖిల్ మిషన్ ను పూర్తి చేశాడా? లేదా? అనేది మిగిలిన కథ.


ప్లస్ పాయింట్స్.. రిక్కీగా ఈ సినిమాలో అఖిల్ పవర్ ఫుల్ పాత్ర‌లో ఆకట్టుకున్నాడు. తన క్యారెక్టర్ కు పూర్తిగా న్యాయం చేశాడు. గత సినిమాల కంటే భిన్నంగా కొత్త లుక్స్ తో చాలా వైల్డ్ గా కనిపించాడు. ఇటు హీరోయిన్ తో లవ్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. అటు యాక్షన్ సన్నివేశాల్లోనూ అదరగొట్టాడు. హీరోయిన్ సాక్షి వైద్య తన అందం, నటనతో మెప్పించింది. ఈ చిత్రానికి ప్రధాన బలం మమ్ముట్టి. ముఖ్యంగా క్లైమాక్స్ లో మమ్ముట్టి నటన అదుర్స్ అనిపించింది. విలన్ గా డినో మోరియా పాత్రలో ఒదిగిపోయాడు. మిగిలిన నటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే మెప్పించారు. కొన్ని సీన్స్ ను డైరెక్టర్ సురేందర్ రెడ్డి హై టెక్నికల్ వేల్యూస్‌ తో సూపర్ గా తెరకెక్కించాడు.

మైనస్ పాయింట్స్ .. ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ ఇంట్రస్టింగ్ గా సాగలేదు. దర్శకుడు సురేందర్ రెడ్డి మంచి కథా నేపథ్యం తీసుకున్నా ఆసక్తికరంగా కథనాన్ని నడపలేకపోయాడు. చాలా సన్నివేశాలు బోర్ గా అనిపిస్తాయి. ఈ మూవీ చూస్తున్నంత సేపు రెగ్యులర్ యాక్షన్ డ్రామాలే గుర్తుకొస్తాయి. పాత్రల్లో ఎమోషన్స్ ఎలివేట్ కాలేదు. క్లైమాక్స్ లో మమ్ముట్టి క్యారెక్టర్ ఎమోషనల్ గా ఉన్నా.. సరిగా పండలేదు. సినిమా చాలాసేపు యాక్షన్ అండ్ ఇన్విస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సాగింది. ఎక్కడా వాట్ నెక్స్ట్ అనే టెన్షన్ ను ప్రేక్షకులకు కలిగించలేకపోవడం ఈ సినిమాకు మరో బలహీనత. ఏజెంట్ మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే జోనర్ మూవీ. కానీ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ను సినిమాలో సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. లాజిక్ లెస్ సీన్స్, ఇంట్రెస్ట్ కలిగించలేని యాక్షన్ డ్రామా సినిమాకు మైనస్ గా మారాయి.

హిప్ హాప్ తమిజా అందించిన మ్యూజిక్ పర్వాలేదనిపించింది. రసూల్ ఎల్లోర్ కెమెరా పనితనం బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ బాగున్నా.. కథకు అవసరం లేని సీన్స్ ను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ అక్కినేని అభిమానులకు నచ్చుతాయి. కానీ అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కావడం కష్టమే .

విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2023
నటీనటులు : అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, సాక్షి వైద్య
కథ : వక్కంతం వంశీ
డైరెక్టర్ : సురేందర్ రెడ్డి
నిర్మాత : సుంకర రామబ్రహ్మం
మ్యూజిక్ : హిప్ హాప్ తమిజా
సినిమాటోగ్రఫీ : రసూల్ ఎల్లోర్
ఎడిటర్ : నవీన్ నూలి

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×